విక్టరీ వెంకటేశ్ 75వ చిత్రం గురించి టాలీవుడ్లో చర్చ జరుగుతుంది. తన కెరియర్లో ఎన్నో డైరెక్టర్లతో నిర్మాతలతో చిత్రాలను చేశారు విక్టరీ. కెరియల్లో మైల్ స్టోన్ దగ్గరకు వచ్చేసరికి హిట్ కావాలని అందరూ కోరుకుంటుంటారు. ఇప్పుడు ఆ అనుభూతి కోసమే ఎదురుచూస్తున్నారు వెంకటేశ్.




విక్టరి వెంకటేశ్ తన 25 సినిమా హిందీలో అనరి చిత్రం చేశారు. ఈ చిత్రాన్ని మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు నిర్మించారు. ఈ సినిమాలో కరిష్మా కపూర్ హీరోయిన్గా నటించారు. 1992లో వచ్చిన తెలుగు సినిమా చంటి. దీనిని బాలీవుడ్లో అనరి పేరుతో రిమేక్ చేశారు వెంకటేశ్. ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. తర్వాత 50వ సినిమాగా 2002లో వాసు, జెమిని చిత్రాలు విడుదల అయ్యాయి. ఈ చిత్రాలకు ఏ కరుణాకరన్, శరణ్ దర్శకత్వం వహించారు. వాసు మూవీ నెగిటివ్ టాక్ వచ్చించి. జెమిని యావరేజ్గా నిలిచింది.




ఇటీవల నాగ చైతన్యతో కలిసి వెంకటేశ్ వెంకిమామ చిత్రంలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. వెంకిమాయ తర్వాత నారప్పా చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఆయన 74వ సినిమా. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ బయటికి వచ్చాయి. యాక్షన్ ఎంటర్ టైనర్ గా భావిస్తున్నారు. చిత్రంలో నారప్పా గెటప్లో యాంగ్రీమన్ గా వెంకటేశ్ కనిపించబోతున్నారు. ఇది తమిళ చిత్రం అసూరన్ కు రిమెక్. వెంకటేశ్ సరసన ప్రియమణి నటిస్తున్నారు. వెక్కాయ్ అనే నవల కథను ఆధారంగా చేసుకొని చిత్రాన్ని నిర్మించారు. నవల రచయిత పోమణి.




వెంకటేశ్ పేరుకు ముందు విక్టరీ అనే ట్యాగ్ ఎలాగో ఉంది. 75 చిత్రం ఆ ఇద్దరు డైరెక్టర్లలో ఎవరో ఒకరు కన్ఫాం అయితే వెంకటేశ్ అభిమానులకు పండగే. అల వైకుంఠపురములో తో నేడు ఇండస్ర్టీ హిట్ను అందించారు త్రివిక్రమ్ పూరీ పోకిరితో నాడు ఇండస్ర్టీ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: