గజినీ వంటి అద్భుతమైన చిత్రాన్ని భారతీయ సినీ ప్రేక్షకులకు ప్రసాదించిన తమిళ ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో గొప్ప సినిమాలు తీసిన మురుగదాస్ ప్రస్తుతం బీలో యావరేజ్ సినిమాలతో సరిపెట్టుకుంటున్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన దర్బార్ చిత్రాన్ని కూడా సూపర్ హిట్ గా నిలపలేక పోయారు. దీనికి కారణం దర్బార్ సినిమాని రజినీకాంత్ అభిమానులను సంతృప్తి పరిచే విధంగా రూపొందించడమే అని మరికొందరు అంటుంటారు. ఏదేమైనా గత కొంత కాలంగా మురగదాస్ మంత్ సినిమాలను తెరకెక్కించలేకపోతున్నారు.


గతంలో హాలీవుడ్ మెమొంటో చిత్రాన్ని ఆధారంగా తీసుకుని అత్యద్భుతంగా ఈ సినిమాని తెరకెక్కించారు. కానీ ఇప్పుడు కొన్ని హాలీవుడ్ సినిమాలను ఇన్స్పిరేషనల్ గా తీసుకున్న ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నారు. 2017 వ సంవత్సరం లో మహేష్ బాబు హీరోగా నటించిన స్పైడర్ సినిమాని అంచనాలకు మించి రూపొందించ లేకపోయారు. నిజానికి ఆ సినిమా అంచనాలను కూడా చేరుకోలేదని చాలామంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. మహేష్ బాబు ఈ సినిమాలో నటించడానికి మురగదాస్ ని నమ్మి ఒప్పుకున్నట్టు మరికొంతమంది చెబుతుంటారు. కానీ అంతిమంగా మహేష్ బాబు ఒక యావరేజ్ ఫిలిం తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహేష్ బాబు తన స్క్రిప్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తనకు స్క్రిప్ట్ నచ్చకపోతే ఎవరి మొహం చూడకుండా నేరుగా రిజెక్ట్ చేస్తుంటారు. కానీ ఏఆర్ మురుగదాస్ విషయంలో మాత్రం మహేష్ బాబు పప్పులో కాలు వేశారని చెప్పుకోవచ్చు.


అల్లుఅర్జున్ తో కలిసి సినిమా తెరకెక్కించాలని మురుగదాస్ అప్పట్లో ప్లాన్ వేశారు. అల్లు అర్జున్ కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు.  కానీ సినిమా కథ విన్న తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీంతో అతను ఒక బిలో యావరేజ్ సినిమా నుండి తప్పించుకోగలిగారు. ప్రస్తుతం సినిమా కథ ని పట్టుకొని తమిళ హీరో విజయ్ వద్దకు ఏ.ఆర్.రెహమాన్ వెళ్లారట. అయితే స్క్రిప్టు విన్న విజయ్ కూడా తనకు నచ్చలేదని నిజంగా తిరస్కరించారట. సన్ పిక్చర్స్ కూడా ఏ ఆర్ మురగదాస్ సినిమా స్క్రిప్ట్ తో చాలా నిరాశ చెందారట. సర్కార్ కత్తి వంటి యావరేజ్ హిట్ సినిమాలను విజయ్ కుమార్ మురగదాస్ తెచ్చి పెట్టారు. కానీ ఈసారి మాత్రం విజయ్ ఈ సినిమాని స్ట్రైట్ గా రిజెక్ట్ చేశారు. దీనితో బన్నీ, విజయ్ మురుగదాస్ సినిమాలో ఒప్పుకోకుండా తప్పించుకున్నాడు కానీ మహేష్ బాబు ఏఆర్ మురుగదాస్ చిత్రంలో నటించడానికి ఒప్పుకుని తప్పు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: