టాలీవుడ్ లో ఉన్న
యువ హీరోల్లో
శర్వానంద్ కు ప్రత్యేక స్థానం ఉంది. యాడ్ ఫిలింస్ నుంచి సినిమాల్లోకి వచ్చి తనకంటూ ఓ
మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. హిట్, ఫ్లాప్స్ కు అతీతంగా
శర్వానంద్ కెరీర్ కొనసాగుతోంది. గమ్యం, రన్
రాజా రన్, ప్రస్థానం, రన్
రాజా, మహానుభావుడు, శతమానం భవతి.. తదితర హిట్లు ఉన్నాయి శర్వా కెరీర్లో. సహజంగానే అందరి హీరోల్లానే ఫ్లాపులు ఉన్నా కూడా దర్శక, నిర్మాతల మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు శర్వానంద్. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్న శర్వా.. తన తర్వాతి ప్రాజెక్టులను అనౌన్స్ చేశాడు.

14 రీల్స్ బ్యానర్ పై
రామ్ అచంట, గోపీచంద్ అచంట నిర్మిస్తున్న ఈ
సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. బి.
కిశోర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు.
హీరోయిన్ గా
ప్రియాంక అరుల్
మోహన్ నటిస్తోంది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై
శర్వానంద్ తన కెరీర్లో 30వ
సినిమా చేస్తున్నాడు. శ్రీ
కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆర్ఎక్స్ 100 అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం
సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో ఈ
సినిమా తెరకెక్కబోతోంది.

శ్రీ
లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’ అనే
సినిమా చేస్తున్నాడు.
విజయదశమి రోజున
పూజా కార్యక్రమాలతో
సినిమా ప్రారంభమైంది.
రష్మిక మందనా హీరోయిన్.
కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఈ
సినిమా తెరకెక్కుతోంది. ఇలా వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇలా వరుసగా సినిమాలు చేయడం గొప్ప విషయం అని చెప్పాలి. ‘ఈ ప్రాజెక్టులన్నీ మంచి సబ్జెక్టులతో రాబోతున్నాయి. వీటి గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అని చెప్పుకొచ్చాడు ఈ
యువ హీరో.