గతంలో సినిమా హీరోల ఫ్యాన్స్ వార్ కు తమ ఊళ్లలో సెంటర్లు వేదికయ్యేవి. సినీ వార పత్రికలు కూడా వేదికయ్యాయి. కాలానుగుణంగా సోషల్ మీడియా విస్తృతమయింది. ఇక అడ్డూ అదుపూ లేకపోయింది ఫ్యాన్స్ కు. ఎటువంటి ప్రత్యక్ష వివాదాలకు తావు లేకుండా అరచేతిలో సెల్ ఫోన్ సాయంతో తమ పోరాటాలు సాగిస్తున్నారు. తమ హీరో సినిమా రికార్డులు క్రియేట్ చేసిందంటే.. మా సినిమా రికార్డులు బ్రేక్ చేసిందని.. ఇలా తమ టాలెంట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మరింత కొత్తగా హీరో పేరుతో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి తమ సత్తా చూపిస్తున్నారు.


ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేశ్ ఫ్యాన్స్ ఇదే చేస్తున్నారు. సందర్భం లేదు.. అవసరం లేదు. కానీ.. తమ హీరో రికార్డుల రారాజు అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ఎన్ని మిలియన్స్ మెసేజెస్ వస్తే అంత గొప్పగా ఫీల్ అవుతున్నారు. సినిమా రిలీజ్ అయినప్పుడో, రికార్డులు క్రియేట్ చేసిన సినిమా విడుదలై కొన్నేళ్లు అయినప్పుడో, హీరో పుట్టినరోజుకు మాత్రమే ఇటువంటి ట్రెండ్స్ క్రియేట్ చేయడం కొన్నేళ్లుగా చేస్తున్నారు. కానీ.. ఇటివల దాదాపు ప్రతి హీరో ఫ్యాన్స్ కూడా అసందర్భంగానే ఏదొక హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి ట్రెండింగ్ చేసే పనిలో ఉంటున్నారు.

ప్రస్తుతం మహేశ్ ఫ్యాన్స్ #BoxOfficeEmperorSSMB అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండింగ్ చేశారు. ఇందులో మహేశ్ ఫ్యాన్స్ భారీగా పాల్గొని తమ హీరోపై అభిమానం చూపారు. 100 మిలియన్స్ మెసేజెస్ తో రికార్డులు క్రియేట్ చేయాలని మహేశ్ ఫ్యాన్స్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆ రికార్డుకు చేరువలో ఉన్నారు. తమ హీరో ఎప్పుడూ టాప్ లో ఉండాలనే తపనతో ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారు. అయితే.. హీరోలకు ఉపయోగం లేకపోయినా ఫ్యాన్స్ చేసే హంగామాను కాదనలేరుగా..!


 


మరింత సమాచారం తెలుసుకోండి: