సమంత ఫాన్స్ కి గుడ్ న్యూస్. ఆమె సినిమాలు మానేసింది అంటూ ప్రచారం జరుగుతున్న తరుణంలో ఎట్టకేలకు తన సినిమా షూటింగ్ కి హాజరు అయింది. నయనతార బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ కోసం చెన్నై చేరుకున్న సమంతా నిన్న సాయంత్రం ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టింది. సమంత మేకప్ వేసుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాలో నయన తార, విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో సమంత నటించడం లేదని ఆమె ఈ సినిమాలో నుంచి తప్పుకుంది అని గట్టిగా ప్రచారం జరిగింది. 


ఆ విషయం మీద ఎప్పుడూ స్పందించని సమంత ఏకంగా షూటింగ్ లో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చింది. నిజానికి ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన రోజు కూడా సమంత పేరు ఈ సినిమా పోస్టర్స్ లో వాడారు కానీ ఆమె షూటింగ్ కి ఆ రోజు కూడా హాజరు కాకపోవడంతో నిజంగా సినిమా నుండి తప్పుకుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ నిన్న ఎట్టకేలకు సినిమా షూటింగ్లో పాల్గొనడం తో ఆ ప్రచారానికి బ్రేక్ పడింది. ఇక ఈ భామ అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది. 


అయితే ఆ అశ్విన్ దర్శకుడిగా చేయనని తప్పుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇక ఆ సినిమాని స్నేహితురాలు నందినిరెడ్డి తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. హారర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సమంతా ఒక పక్క సినిమాలతోనే కాక మరో పక్క ఆహా యాప్ కోసం ఒక షో చేస్తూ బిజీగా ఉంది. మరో పక్క బట్టల బిజినెస్ కూడా మొదలు పెట్టిన ఈ భామ నాలుగు రాళ్ళు వెనకేసుకునే పనిలో పడింది. లాక్ డౌన్ తర్వాత సమంత చేస్తున్న మొదటి సినిమా ఇదే. తెలుగులో మాత్రం ఇంకా ఎటువంటి సినిమా అనౌన్స్ చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: