తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్నాళ్ల పాటు ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్లలో ఒకరు సమీరారెడ్డి. ఇక ఈ పేరుకు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అన్న విషయం తెలిసిందే.   తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నది  సమీరారెడ్డి.  ఒకప్పుడు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని కొన్నాళ్లపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో గా కొనసాగింది. జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాల్లో మెరిసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ తెలుగమ్మాయి.


 ఇక ఆ తర్వాత బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ అక్కడ హాట్ హాట్ అందాలతో బాలీవుడ్ ప్రేక్షకులు అందరిని మైకంలో ముంచెత్తింది అన్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత అక్కడ కొన్ని సినిమాలలో తన హాట్ హాట్ అందాలతో అభిమానులను ఆకట్టుకుంది. ఇక  అవకాశాలు ఎక్కువగా రాకపోవడంతో బాలీవుడ్ తెరపై కనుమరుగయ్యింది. ఇక ఆ తర్వాతనే నెపోటీజం  కారణంగానే తనకు అవకాశాలు రాలేదు అంటూ కొన్ని సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసింది ఈ ముద్దుగుమ్మ. కొన్నేళ్ల కింద ఓ బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది.


 ఇక అందరు హీరోయిన్లు లాగానే ఈ అమ్మడు కూడా మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుంది ఏమో అని అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఇటీవలే తన రీ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చింది సమీరారెడ్డి. తనకు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు అంటూ చెప్పేసింది. అదే సమయంలో తాను ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవం కూడా తెలిపింది. ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో ఫోటోలను అభిమానులతో పంచుకుంటే ఇక తాను  ప్రెగ్నెంట్ గా ఉన్నాను అని కూడా చూడకుండా దారుణంగా ట్రోల్స్ చేసేవారిని అది  చూసి ఏడ్చేదాన్ని అంటూ తెలిపింది. రెండవ సారి గర్భం దాల్చిన తర్వాత ఎలాంటి ట్రోల్స్  వచ్చిన పట్టించుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది సమీరారెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: