అక్కినేని వారి కోడలు సమంత అక్కినేనికి ఈరోజు ఎంతో ప్రత్యేకమైంది. ఆమె టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సూపర్ హిట్ సినిమా "ఏమాయ చేసేవే" సినిమా విడుదలై ఈరోజుకు 11ఏళ్ళు అయ్యింది. ఈ సినిమాతో సమంతకు కెరీర్ పరంగానే కాక జీవితంలోనూ ఎంతో స్పెషల్. ఎందుకంటే తన మొదటి సినిమా హీరోనే తన జీవిత భాగస్వామి అయ్యారు. ఇక ఒక నటికి ఇంత కంటే అదృష్టం ఏముంటుంది. అందుకే ఏ స్పెషల్ రోజున సమంత ఒక స్పెషల్ వీడియోతో తన అభిమానుల ముందు వచ్చి జీవితంలో ఈరోజు ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పింది. ఇక ఈ సినిమాను గౌతమ్ మీనన్ తెరకెక్కించగా...మంజుక ఘట్టమనేని నిర్మించారు. అంతే కాకుండా ప్రముఖ సంగీత దర్శకుడు ఎ ఆర్ రెహమాన్ సినిమాకు స్వరాలు సమకూర్చారు. ఇక ఈ సినిమా   ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అటు నాగ చైతన్య కెరీర్ లో మొదటి సినిమా కాకపోయినా తన భార్యతో మొదటి సినిమా కాబట్టి స్పెషల్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా తరవాత కూడా సమంత నాగ చైతన్య కలిసి నటించారు. ఇక ఈ సినిమా 11 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత పోస్ట్ చేసిన వీడియోలో "సినిమా ఫస్ట్ లవ్ కదా..  అంత ఈజీగా తగ్గదు. హ్యాపీ యనివర్సరీ టూ మీ.. నా జర్నీలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీరు లేకుండా ఇదంతా సాధించలేను. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం" అంటూ వీడియోలో వెల్లడించింది. ఇక ప్రస్తుతం  సమంత సినిమాలతో పాటు...డిజిటల్ ప్లాట్ ఫామ్ పై కూడా సందడి చేస్తుంది. వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లో నటించిన సమంత ప్రస్తుతం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తూ అలరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: