అంబాలా లోని పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించిన ఓం పురి తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, పంజాబీ వంటి భాషా చిత్రాల్లో నటించి గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు పొందారు. అయితే అతడి తండ్రి ఆర్మీ జవాన్ గా కొంతకాలం పనిచేసి ఆ తర్వాత రైల్వే శాఖలో ఉద్యోగిగా చేరారు. కానీ ఉద్యోగంలో చేరిన కొద్ది రోజుల్లోనే అతడిపై కొన్ని అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అతన్ని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి జైలుకు పంపించారు. ఫలితంగా ఓంపురి కుటుంబం తీవ్ర నిరాశలో మునిగి తేలింది. మరోవైపు ఆర్థిక సమస్యలు కూడా వారిని వెంటాడాయి. దీంతో ఓం పురి రైల్వే స్టేషన్ లో బొగ్గులను ఏరుకుని వాటిని విక్రయించి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని ముందుకు నడిపారు.

ఆ తర్వాత టీ స్టాల్లో కప్పులు కూడా అందించారు. అనంతరం ముంబై నగరానికి విచ్చేసిన ఆయన తన స్నేహితుడు, ప్రముఖ నటుడు అయిన నజీరుద్దీన్ షా ని కలిశారు. తన స్నేహితుడి సలహా తో ఆయన యాక్టింగ్ స్కూల్లో చేరి నటనలో మెళుకువలు నేర్చుకున్నారు. ఆ తర్వాత చిన్నాచితక పాత్రల్లో నటించి బాగా గుర్తింపు దక్కించుకున్నారు. కాలక్రమేణా స్టార్ యాక్టర్ అయ్యారు. నిజానికి ముంబై కి వచ్చినప్పుడు ఓం పురి వద్ద ఇనిస్ట్యూట్ ఫీజు కట్టడానికి 280 రూపాయలు కూడా లేవట. కానీ ఆ మొత్తాన్ని అప్పుగా తీసుకొని నటన నేర్చుకొని తన టాలెంట్ తో ఎన్నో సువర్ణ అవకాశాలు దక్కించుకుని లక్షల రూపాయలు సంపాదించారు.

లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత ఆయన సీమా కపూర్ ని పెళ్లి చేసుకున్నారు కానీ ఏవో కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 8 నెలలకే వాళ్ళిద్దరూ విడిపోయారు. కొంతకాలం తర్వాత ఆయన నందిని రెడ్డి అనే ఒక జర్నలిస్టు ని రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె ఓం పురి పై అనుమానంతో ఆయన ఆడవారితో రహస్యంగా అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారా అనే అంశాలను తెలుసుకుని ఒక బుక్ లో రాసుకునేవారు. ఓం పురి రహస్యాలన్నీ తక్కువ సమయంలోనే తెలుసుకున్న ఆమె ఆ విషయాలన్నీ ఒక బుక్ లో రాశారు. అదే బుక్ ని 'Hero Unlikely' పేరిట పబ్లిష్ చేశారు.

ఈ విషయం తెలిసిన ఆయన తన భార్య పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్లి గృహహింస చట్టం కింద తన భర్తపై కేసు ఫైల్ చేసారు. తర్వాత తన కొడుకుని తనతో పాటే తీసుకెళ్లారు. ఒకవైపు సమాజంలో పరువు పోవటంతో పాటు మరోవైపు తన భార్య పిల్లలు దూరం కావడంతో ఆయన మానసికంగా కృంగిపోయారు. తన బాధను మరిచిపోవడానికి అదేపనిగా మద్యం తాగుతూ చివరికి గుండెపోటుతో మరణించారు. ఏది ఏమైనా దాదాసాహెబ్ ఫాల్కే, పద్మశ్రీ వంటి అగ్ర పురస్కారాలను పొందిన ఓంపురి చివరి రోజుల్లో మాత్రం చాలా దయనీయమైన జీవితాన్ని గడిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: