కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడంతో ఆయన అభిమానులు అమితమైన గర్వంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో రజినీకాంత్ కి అత్యుత్తమ పురస్కారమైన పద్మ విభూషణ్ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాజకీయ ప్రయోజనాల కోసమే రజనీకాంత్ కి తాజాగా అవార్డు ప్రకటించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రజనీకాంత్ కి అవార్డు ప్రకటించినప్పుడల్లా అందరికీ చిరంజీవే గుర్తుకొస్తారు. ఎందుకంటే రజనీకాంత్ తో సరిసమానంగా చిరంజీవి కూడా సినిమా ఇండస్ట్రీ ఎన్నో సేవలు అందించారు. చిరు నటనా ప్రతిభ లో కూడా ఏ మాత్రం తీసిపోరు. కానీ ఇప్పటివరకు చిరంజీవికి నేషనల్ అవార్డు దక్కలేదంటే అతిశయోక్తి కాదు.


పద్మభూషణ్ అవార్డుతో పాటు డాక్టరేట్ కూడా అందుకున్న చిరంజీవి ఆస్కార్ అవార్డ్ సెరిమోనీ లో పాల్గొనే అవకాశం కూడా దక్కించుకున్నారు. 1993 లో అత్యధిక పారితోషికం పుచ్చుకున్న హీరోగా కూడా ఆయన రికార్డు సృష్టించారు. ఎన్నో దశాబ్దాల పాటు నెంబర్ వన్ హీరోగా ఇండియా సినిమా చరిత్రలో తనకంటూ గొప్ప చరిత్రను సృష్టించుకున్నారు. విభిన్నమైన పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలెంటెడ్ యాక్టర్ చిరంజీవి కి జాతీయ పురస్కారం ప్రకటించాలని మెగా అభిమానులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. భారతరత్న పురస్కారానికి కూడా చిరంజీవి అర్హుడని మెగా అభిమానులు అంటున్నారు.


అయితే బీజేపీ పార్టీ లో చేరడానికి చిరంజీవి నిరాకరించారని.. అందుకే చిరు కి కావాలనే ఎటువంటి అవార్డు ప్రకటించడం లేదని కొందరు మెగా అభిమానులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అలా జరిగి ఉండక పోయినట్లయితే ఇప్పటికే చిరంజీవికి కచ్చితంగా పద్మవిభూషన్ తో పాటు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా లభించి ఉండేదని మెగాస్టార్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో చిరంజీవికి సినిమాకు సంబంధించి ఉన్నతమైన అవార్డులు ప్రకటించకపోతే ఆ అవార్డులకే విలువ ఉండదని మరికొందరు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: