యష్ నటించిన కేజిఎఫ్ సినిమా ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాకి సీక్వెల్ గా కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమాను తెరక్కేక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం అందరు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ఎంతో ఖర్చుపెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇది ఒక భారీ యాక్షన్ పీరియాడిక్ డ్రామాగా తెలుస్తుంది. ఈ చిత్రంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్నారు. యష్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ స్టార్ అయినాగానీ అందరి మెప్పు పొందాడు.ఈ సినిమాలో యష్ కి జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నది.అలాగే  పలువురు బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.అధీరా పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నాడు.ఇంకా ప్రధానమంత్రి పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తుంది.ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.

ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ గత కొద్ది రోజుల నుంచి కేజీయఫ్ టైమ్స్ అనే మ్యాగజైన్స్ ను విడుదల చేస్తున్నారు.ఈ మ్యాగజైన్ లో చిత్రానికి సంబందించిన అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్ డేట్ ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మన టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేష్ పుట్టినరోజు సందర్బాన్ని పురస్కరించుకొని ఈ చిత్రంలో తన పాత్ర పై ఒక స్పెషల్ మ్యాగజైన్ ను విడుదల చేశారు చిత్రం యూనిట్.

కేజిఎఫ్ చాప్టర్ 2 లో రావు రమేష్ కన్నెగంటి రాఘవన్ అనే పాత్ర చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా తాను ఒక సిబిఐ ఆఫీసర్ గా ఈ చిత్రంలో కనిపిస్తానని, హీరో రాకీ కేసును డీల్ చేసే స్పెషల్ ఆఫీసర్ గా ఈ చిత్రంలో తన పాత్ర ఉండనున్నట్లు తెలిపారు.ఈ సినిమా అప్ డేట్స్ గురించి ఎంతగానో ఎదురుచూసే అభిమానులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. రావు రమేష్ పుట్టిన రోజున సినిమా గురించిన ఒక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ ను సినిమా మేకర్స్ రిలీజ్ చేయడం నిజంగానే అభిమానులకు మంచి వార్తనే చెప్పాలి. ఇదిలా ఉంటే కేజిఎఫ్ చాప్టర్ 2 జులైలో విడుదల కావాల్సి ఉంది.ప్రస్తుత పరిస్థితులలో అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: