టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరోల్లో నిఖిల్ సిద్దార్థ్ ఒకడు. కెరీర్ ప్రారంభం నుంచి కొత్త తరహా కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అంతేకాకుండా తనదైన నటనతో పక్కింటి అబ్బాయిలా అందరినీ ఆకట్టుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో గుర్తింపు లేని పాత్రలు చేసినప్పటికీ ‘హ్యాపి డేస్’ సినిమాతో గుర్తింపు పొందాడు. అయితే  2014లో వచ్చిన కార్తికేయ సినిమాతో స్టార్ హోదాను అందుకున్నాడు. కార్తికేయ అందించిన విజయంతో నిఖిల్ మంచి జోష్ కనబరిచాడు. అదే జోష్‌లో సూర్య vs సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడ, కేశవ వంటి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకకుల ముందుకు వచ్చాడు.
 

అయితే నిఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. వాటిలో 18 పేజెస్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉండనుందట. ఈ సినిమాను ‘కుమారి21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. దానికి కారణం ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్‌ప్లేను సుకుమార్ అందించడమే. ఈ సినిమా ఇప్పటికే దాదాపు పూర్తయింది. మరికాస్త చిత్రీకరణ మిగిలిఉంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోయింది.


అయితే ఈ సినిమా నుంచి జూన్ 1న ఈ సినిమా నుంచి నిఖిల్ ఫస్ట్ లుక్ వస్తుందన్న అధికారిక ప్రకటన వచ్చింది. ఈ మేరకు ఓ ప్రీలుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ అప్‌డేట్‌పై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఈ ఫస్ట్ లుక్‌లో నిఖిల్ చాలా కొత్తగా కనిపిస్తాడని, చాలా వైలెంట్ లుక్స్‌లో ఉంటాడని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అప్‌డేట్ ఏంటని తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.


ఇదిలా ఉంటే ఈ సినిమాతో హిట్ అందుకొని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని నిఖిల్ చూస్తున్నాడు. అందుకోసం ఈ సినిమాపై నిఖిల్ భారీ ఆశలు పెట్టుకున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినిమా నిఖిల్ ఆశించిన హిట్ అందుకుంటాడా లేదా అనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: