తెలుగు సినిమాల్లో ఒక హీరో సినిమాలో మరో హీరో గెస్ట్ రోల్ లో ఎంట్రీ ఇవ్వడం లాంటివి కామన్ గా జరుగుతూ ఉంటాయి. కొంతమంది గెస్ట్ పాత్రల్లో వచ్చిన నటులు ఇక సినిమా కథను మలుపు తిప్పితే.. మరి కొంతమంది ఊరికే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు.  ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో ఇతర హీరోలు గెస్ట్ రోల్ లో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరించారు.  అయితే కొన్ని సినిమాల్లో మాత్రం గెస్ట్ రోల్స్ కాస్తా ప్రేక్షకులకు ట్విస్ట్ ఉంటాయ్.  ఇక అక్కినేని వారి కోడలు సమంత నటించిన ఓ బేబీ సినిమా విషయంలో కూడా ప్రేక్షకులకు ఇలాంటి ట్విస్ట్ ఎదురైంది.


 కొరియన్ మూవీ మిస్ గ్రానీ తెలుగు రీమేక్ గా ఓ బేబీ సినిమా తెరకెక్కింది. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.  ఈ సినిమాలో సమంత  ప్రధాన పాత్రలో నటించగా సీనియర్ నటి లక్ష్మి.. రావు రమేష్ కీలక పాత్రలో నటించారు. మరో కీలక పాత్రలో అటు నాగశౌర్య కూడా నటించాడు. 70 ఏళ్ల వృద్ధురాలు 24 ఏళ్ల యువతి గా మారడం అనే వినూత్నమైన కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతోంది.70 ఏళ్ల వృద్ధురాలు అయినా సావిత్రి అలియాస్ బేబీ  (లక్ష్మీ)  పెళ్లైన ఏడాదిలోనే భర్తను కోల్పోయి.. చిన్నతనం నుండి  ఒంటరిగానే జీవితాన్ని నెట్టుకొస్తుంది. .. కొడుకు (రావు రమేష్)ని ప్రయోజకుడ్ని చేస్తుంది. కొడుకు (రావు రమేష్)పై విపరీతమైన ప్రేమ ఉండటంతో పాటు బేబీకి కాస్త చాదస్తం ఎక్కువ.

 ఇక ఈ చాదస్తం తట్టుకోలేక చివరికి ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్లిపోవాలని బేబీ కి చెబుతారు. ఇలా ఇక  బేబీ పాత్రలో ఉన్న లక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇక అంతలో కథలో ట్విస్ట్.. జగతిబాబు ఎంట్రీ ఇస్తాడు. ఇక బేబీ చేతికి ఒక శివలింగం ఇచ్చి కథను మలుపు తిప్పాడు. ఇక అప్పుడే 70 ఏళ్ల బేబీ కాస్త 24 ఏళ్ల యువతీగా మారిపోతుంది. ఇలా కథ సాగిపోతూ ఉంటుంది. ఇక సమంత తో పాటు చివరి వరకు ఆమె స్నేహితుడి పాత్ర ( రాజేంద్ర ప్రసాద్  ) కొనసాగుతుంది . ఇక చివరికి ఎన్నో ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్య .. తన మనవడిని కాపాడుకోవడానికి రక్తం ఇచ్చి మళ్ళీ వృద్ధురాలి గా మారిపోతుంది సమంత.

అయితే ఈ సినిమాలో కథను మలుపు తిప్పే పాత్ర లో గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన  జగపతి బాబు  అందరిని ఆశ్చర్య పరిచాడు. ఇక సమంత కాస్త వృద్ధురాలి గా మారిపోయిన తర్వాత  మరో గెస్ట్ ఎంట్రీ అందరికీ ట్విస్ట్ ఇస్తుంది . ఇక మధ్యలో కథను మలుపు తిప్పిన జగపతిబాబు శివలింగాన్ని ఈ సారి రాజేంద్ర ప్రసాద్ కి ఇస్తాడు..  చివరికి రాజేంద్రప్రసాద్ యువకుడిగా నాగచైతన్య గా మారుతాడు. ఇక చివర్లో బైక్ పై స్టైల్ గా వచ్చి అందరికీ ట్విస్ట్ ఇస్తాడు నాగచైతన్య. ఇలా ఒక గెస్ట్ రోల్ కథను మలుపు తిప్పితే.. మరో గెస్ట్ రోల్  దీక్షకు ట్విస్ట్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: