టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్ లు హీరోయిన్ లుగా పరిచయమై ఆ తర్వాత వైవాహిక జీవితం లోకి వెళ్లి మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు తులసి. అందరూ ఆమెని తులసి శివమణి అని కూడా అంటారు. అలనాటి నటీమణి అంజలీదేవి కి సావిత్రికి మంచి స్నేహితురాలు అయిన తులసి ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి ఆదరణ దక్కించుకున్నారు. భార్య సినిమా నిర్మాత ఒక బాలనటి కోసం వెతుకుతుండగా ఈమె స్నేహితురాలు ఒకరు తులసిని ఆ పాత్రకు రిఫర్ చేశారు.

అప్పటినుంచి చాలా సినిమాలలో బాల్యనటిగా ఆ తర్వాత హీరోయిన్ గా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు తులసి. అప్పట్లో తులసి చాలా చురుకైన పిల్ల అని గమనించి తల్లిదండ్రులు సినీ రంగంలో ఆమె రాణించగలరని అనుకున్నారు. ఒకటిన్నర ఏళ్ల వయసులోనే చిత్రం సీమలోకి ప్రవేశించిన ఆమె 1977లో విడుదలైన చిల్లర కొట్టు చిట్టెమ్మ సినిమాలో జయచిత్ర పాత్ర చేసి మంచి పేరు తెచ్చుకుంది.  సీతామహాలక్ష్మి చిత్రంతో నలుగురి దృష్టిలో పడ్డ తులసి ఆమెపై 3 పాటలు చిత్రీకరించడం తో ఈమె పోషించిన పాత్ర ప్రధాన పాత్ర అయింది. ఇంకా శంకరాభరణం సినిమాతో తులసి తెలుగు నాట ఇంటింటా ఆమె పోషించిన పాత్ర  పేరు తులసి రామ్ గా పేరు తెచ్చుకున్నది. ఈ సినిమాలో సోమయాజులు మంజుభార్గవి తర్వాత చెప్పుకోదగ్గ పాత్ర తులసీదే. కథానాయికగా తులసి జంధ్యాల దర్శకత్వం వహించిన ముద్దమందారం సినిమా లో చేసింది. ఆ తర్వాత నాలుగు స్తంభాలాట, శుభలేఖ, మంత్రిగారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాల్లో రెండో కథానాయికగా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఆ తర్వాత ఆమెకు ఈ తరహా పాత్రలు ఎక్కువగా వచ్చాయి. ఈ మూస చట్రంలో నుంచి బయటపడడానికి ఆమె కొన్ని సినిమాలలో కూడా నటించింది అంతేకాకుండా గ్లామర్ పాత్రలు కూడా పోషించింది.

తులసికి సినీ సంగీత దర్శకుడితో పెళ్ళి నిశ్చయమైంది కానీ చివరి క్షణంలో పారిపోయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని సినీరంగంలో వదంతులు ఉన్నాయి. అయితే ఓ ఇంటర్వ్యూలో ఈ సంగతిని ఖండించలేదు. ఆ వ్యక్తి పేరును బయటపడడానికి మాత్రం నిరాకరించింది. తులసి ఒక కన్నడ దర్శకనిర్మాతను కలిసిన మొదటి రోజు పెళ్లి చేసుకున్నది. హీరోయిన్ గా ఆమె 1993లో కన్నయ్యకిట్టయ్య అనే సినిమాలో చేసి ఆ తర్వాత హీరోయిన్ గా సినిమాలు ఆపేసి సంసార జీవితంలో స్థిరపడింది. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన డార్లింగ్ సినిమా లో హీరో తల్లి పాత్ర పోషించింది. దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత తులసి మళ్లీ సినిమాల్లో కనిపించడంతో ఆమె అభిమానులు ఎంతగానో ఆనందపడ్డారు. ఆ తరువాత పెద్ద హీరోల సినిమాలలో ముఖ్యమైన పాత్రలు చేస్తూ నటిగా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: