
కానీ, డైరెక్టర్ సుకుమార్ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. పుష్ప టైమ్‌లో తన మీద పడిన నెగిటివిటీని ఈ సినిమా ద్వారా పాజిటివిటీగా మార్చుకోవాలని, అందుకే క్రేజ్ తక్కువగా ఉన్న కొత్త హీరోయిన్‌కి ఛాన్స్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారట. అలాగే, కథలో కూడా రామ్ చరణ్‌ను కొత్త షేడ్‌లో చూపించేందుకు కొన్ని ఎక్స్‌పెరిమెంట్స్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. అయితే, ఇక్కడే అసలైన ట్విస్ట్ వచ్చింది. రామ్ చరణ్ మాత్రం ఈ విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించాడట. ఇటీవల “ఓజి” సినిమా చూసిన తర్వాత చరణ్ కూడా అలాంటి పవర్‌ఫుల్ ఎమోషనల్ ఫీల్, హై ఎలివేషన్స్ ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యాడట. దాంతో ఈ సినిమాకి కూడా మాస్ ఎలిమెంట్స్, ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ వచ్చే సీన్స్ తప్పనిసరిగా ఉండాలని డైరెక్టర్‌కి చెప్పాడని సమాచారం.
ఇక ఫ్యామిలీ బేస్డ్, ఎమోషనల్ డ్రామాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే సుకుమార్ స్టైల్‌కి, రామ్ చరణ్ డిమాండ్ చేసిన మాస్ హై ఎలివేషన్స్ కలపడం అంత సులువు కాదు. దాంతో ఇప్పటివరకు రాసుకున్న స్క్రిప్ట్ మొత్తం మార్చాల్సిన పరిస్థితి రావొచ్చని, లేదంటే హీరోనే మార్చేయాల్సి వస్తుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.మొత్తానికి, ఈ మూవీకి సంబంధించిన ఎక్స్‌పెక్టేషన్స్ అలా ఉండగానే, ఇప్పుడు చరణ్–సుక్కు మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ బయటపడటంతో కథ పూర్తిగా రివర్స్ అయినట్టే. ఇక ఫైనల్‌గా ఏమవుతుందో చూడాలి – సుక్కు తన స్టైల్ వదులుకుని చరణ్ డెసిషన్‌కి లోబడతాడా, లేక చరణ్ డిమాండ్స్‌ని తగ్గించుకుంటాడా అన్నది ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో సస్పెన్స్‌గా మారింది..!!