నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో ముంబై సోమవారం రాత్రి అరెస్టు చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన రిమాండ్ కోరుతూ కోర్టులో హాజరు పరచగా రాజ్ కుంద్రాకు జూలై 23 వరకు పోలీసు కస్టడీ విధించింది కోర్టు. సోమవారం రాత్రి అరెస్ట్ అయిన రాజ్ మంగళవారం ఉదయం వరకు క్రైమ్ బ్రాంచ్ సెల్ లోనే ఉన్నారు. మహారాష్ట్ర సైబర్ గత ఏడాది చాలా మందిని అరెస్టు చేసింది. వారిలో కొందరికి రాజ్ కుంద్రాతో సంబంధాలు ఉన్నట్లు నిర్ధారణ చేసుకుంది. ఆయనపై ఐబిసి సెక్షన్లు 292, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్షన్ 67, 67ఎ, మహిళల అసభ్య ప్రాతినిధ్యం (నిషేధం) రూల్స్ 3, 4 కింద సైబర్ పోలీసులు గత ఏడాది కేసు నమోదు చేశారు. కొన్ని ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు తమ వెబ్ సిరీస్‌లో భాగంగా అశ్లీల వీడియోలను ప్రచురిస్తున్నాయన్న ఆరోపణల ఆధారంగా కేసు నమోదు కాగా... జూన్ లో రాజ్ ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. అంతేకాకుండా ముందస్తు బెయిల్ కోరుతూ తాను స్టార్ట్‌అప్ నుంచి నిష్క్రమించానని, పోర్న్ యాప్స్ కేసుతో సంబంధం లేదని రాజ్ ఖండించారు. అంతేకాకుండా అతను తన పెట్టుబడుల పత్రాలు, ఎగ్జిట్ ఫార్మాలిటీలను పోలీసులకు సమర్పించాడు. అప్పటి నుంచే రాజ్ కుంద్రాను పోలీసులు గమనిస్తున్నారు.

కాగా ఈ పోర్నోగ్రఫీ కేసులో పూనమ్ పాండే, షెర్లిన్ చోప్రా కూడా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. షెర్లిన్ చోప్రా, పూనమ్ పాండే ఈ కేసులో మహారాష్ట్ర సైబర్ సెల్ లో రికార్డ్ చేసిన వాంగ్మూలాల వివరాలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు వీరిద్దరికీ సాఫ్ట్ పోర్న్ కేసుతో సంబంధం ఉందని, రాజ్ కుంద్రా వారిని ఈ అడల్ట్ ఇండస్ట్రీకి తీసుకువచ్చినట్లు వారు అంగీకరించారు. షెర్లిన్‌కు ప్రతి ప్రాజెక్టుకు రూ .30 లక్షలు చెల్లించారు. ఇప్పటివరకు ఆమె రాజ్ కుంద్రా కోసం 15 నుండి 20 ప్రాజెక్టులు చేసింది. పూనమ్ పాండే రాజ్ కుంద్రా సంస్థ ఆర్మ్స్‌ప్రైమ్ మీడియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా వెలుగులోకి వచ్చింది. ఈ ఒప్పందం 8 నెలల క్రితం ముగిసినప్పటికీ రాజ్ కుంద్రా సంస్థ తన సినిమాలు, ఫుటేజీలను చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తున్నట్లు పూనమ్ పాండే రాజ్‌పై 2020లో ఫిర్యాదు చేశారు. ఆర్మ్స్‌ప్రైమ్ మీడియా భారతీయ మోడళ్ల కోసం యాప్స్ అభివృద్ధి చేస్తుంది, వీరిలో కొందరు గెహ్నా వశిష్ట, షెర్లిన్ చోప్రా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: