ప్రేమ ఎంతో మధురం. ప్రేమలో పడిన వారికి లోకంతోనే సంబంధం ఉండదు. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. చాలా మంది సెలబ్రిటీలు వయసుతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇండస్ట్రీతో పరిచయం లేకుండా ప్రేమలో పడుతుంటారు. వయసులో తేడా ఉన్నా.. పెళ్లి పీటలు ఎక్కి సంతోషంగా వివాహ జీవితాన్ని గడుపుతున్నారు. వయసు తేడా విషయంలో మగవాళ్ల కంటే ఆడవాళ్లలోనే ఎక్కువ ఉన్నారు. ఆడవారు తమకంటే పెద్ద వారిని పెళ్లి చేసుకున్నారు. అలాంటి వారు స్పోర్ట్స్, సినీ ఇండస్ట్రీలో ఉన్నారు.

ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తన కంటే ఐదేళ్లు పెద్దదైన అంజలితో వివాహం చేసుకున్నారు. తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ ఇద్దరూ మంచి నటులే. నమ్రతా కన్నా మహేశ్ బాబు చిన్న వయసు. పెద్దలను ఒప్పించి ఒక్కటై సంతోషంగా ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ తన కంటే పెద్ద అయిన అమృతా సింగ్‌తో పెళ్లి చేసుకున్నారు. ప్రముఖ నటి శిల్పాశెట్టి.. తన కంటే చిన్నవాడైన రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుంది. శిల్పాశెట్టి కంటే రాజ్ కుంద్రా 3 నెలలు చిన్న. రాజ్ కుంద్రా ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను కొనుగోలు చేశాడు.

ప్రపంచ సుందరి, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఐశ్వర్య.. అభిషేక్ కంటే 2 ఏళ్ల పెద్దది. బాలీవుడ్ నటి బిపాసా బసు.. కరన్ సింగ్‌ను వివాహం చేసుకుంది. బిపాసా బసు కరన్ కంటే 3 ఏళ్లు పెద్దది. అలాగే ప్రియాంక చోప్రా తనకంటే 11 ఏళ్లు చిన్న వాడైన నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్నారు. అలాగే అనుష్క శర్మ.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్నారు. కోహ్లీ.. అనుష్క కంటే 6 నెలల చిన్నవాడు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మలైక అరోరా, అర్జున్ కపూర్ జంట హాట్ టాపిక్‌గా మారింది. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. కాగా, అర్జున్ కపూర్.. మలైక కంటే 15 ఏళ్లు చిన్నవాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: