అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తన అందంతో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతోమంది హృదయాలను దోచుకుంది లావణ్య త్రిపాటి. తొలి సినిమాలో తన అభినయంతో మంచి పేరు సంపాదించుకొని టాలీవుడ్ దర్శకుల కళ్ళల్లో పడింది ఉత్తరాఖండ్ భామ. ఫ్యాషన్ రంగంలో మిస్ ఉత్తరాఖండ్ గా పేరు సంపాదించుకొని సినిమా పట్ల మక్కువ తో తెలుగులోఅడుగు పెట్టింది. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆమెను ఆహ్వానించి అందలం ఎక్కించింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హోదా ను అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక  సోషల్ మీడియాలో తెగ బిజీగా గడుపుతున్న కనిపించే ఈ ముద్దుగుమ్మ ఫోటోల తో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ ఓ హీరో వల్ల కష్టాలు పడ్డాను అని చెబుతోంది. దూసుకెళ్తా భలే భలే మగాడివోయ్ సోగ్గాడే చిన్నినాయన వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈమె హిందీ తమిళ భాషల్లో కూడా సినిమాలు చేసి మంచి నటిగా గుర్తింపు పొందింది. అయితే ఆ మధ్యలో హిట్ సినిమాలు చేయక పోవ తో ఆమె కెరీర్ అయిపోయిందని అనుకున్నారు. 

ఆమె హిట్ సినిమాల కంటే ఫ్లాప్ సినిమాలు చెయ్యడం ఎక్కువయింది. ఈమె హీరోయిన్ గా చేసిన కొన్ని చిత్రాలు మాత్రమే సక్సెస్ కావడంతో ఐరన్ లెగ్ అనే పేరును తెచ్చుకుంది. ఇక ఈమె మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సినిమాలో నటించిన ఇంటెలిజెంట్ సినిమా పై ఎన్నో ఆశలు పెంచుకుంది. అంతే కాకుండా ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంటుందని ఆమె ఎంతగానో  ఈ సినిమాపై అంచనాలు పెట్టుకోగా ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో అవకాశాల కోసం చాలా కష్టపడింది. ఈ విధంగా మెగా హీరోలు వల్ల ఆమెకు ఇబ్బందులు బాగా ఎదురయ్యాయట. ఒక విధంగా లావణ్య త్రిపాఠి మెగా హీరో సాయిధరమ్ తేజ్ తన కెరీర్ ను నాశనం చేశాడని ఫీలవుతున్నారు ఆమె అభిమానులు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమె కెరీర్ చక్కదిద్దాలని ఓ హిట్ పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: