తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది బాల నటులుగా అడుగుపెట్టి, తమ నటనతో అప్పట్లోనే ప్రేక్షకులను అబ్బుర పరిచిన చిన్నారులు, ప్రస్తుతం పెద్ద స్టార్ హీరోలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు అప్పట్లో ఎవరైతే బాలనటులుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారో, అలాంటి వారంతా ప్రస్తుతం స్టార్ హీరో, హీరోయిన్లుగా కొనసాగుతున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఒక స్టార్ హీరోగా వెలుగుతున్న ఒక నటుడు కూడా సినీ ఇండస్ట్రీలోకి మూడున్నర సంవత్సరాల వయసులోనే అడుగుపెట్టి, మొదటి సినిమాతోనే జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఆయన ఎవరో అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


ఆయన ఎవరో కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి ..విశ్వ నటిగా గుర్తింపు పొందిన కమలహాసన్. ఈయన  తన మూడున్నర సంవత్సరాల వయసులోనే తమిళ సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేశాడు. మొదటిసారిగా కలత్తూర్ కన్నమ్మ అనే చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కమల్ హాసన్, ఈ సినిమాతో ఉత్తమ నటనను కనబరిచి ,ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డు పొందడం గమనార్హం. అంత చిన్న వయసులోనే జాతీయ అవార్డును పొంది రికార్డును తిరగ రాశాడు ఈ విశ్వ నటుడు. శాస్త్రీయ కళలకు  కమలహాసన్ పెట్టింది పేరు. భరతనాట్యం చేయడంలో కమల్ హాసన్ కు  ఎవరు సాటిరారు.


టీనేజ్ వయసులో ఉన్నప్పుడే నృత్య దర్శకుడిగా కూడా పనిచేసి, అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇకపోతే భారత దేశం గర్వపడేలా ఎన్నో చిత్రాలలో నటించి, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు. ఇకపోతే ఈయన కూతురు శృతి హాసన్ కూడా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కమల్ హాసన్ ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా షూటింగ్ దాదాపుగా 70 శాతం పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మిగతా షూటింగ్ ను కూడా మొదలు పెడతామని, దర్శకుడు శంకర్ తో కలిసి కమల్ హాసన్ తెలపడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: