అన్నదమ్ముల అనుబంధం అనే పంచ్ లైన్ తో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా 2013లో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మహేష్ బాబు,వెంకటేశ్, ప్రకాష్ రాజ్, అంజలి, సమంతా తదితరులు నటించారు. ఈ చిత్ర కథ రేలంగి అనే ఊరిలోని ఒక అందమైన ఫ్యామిలీ, వారి బంధువుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ ఫ్యామిలీలోని కుటుంబ పెద్ద అయిన రేలంగి పాత్రలో ప్రకాష్ రాజ్ చాలా చక్కగా ఒదిగిపోయారు. అతని భార్య పాత్రలో జయసుధ అద్భుతంగా నటించింది. వీళ్లిద్దరూ సానుకూల దృక్పథంతో తమ పిల్లలను ఎంతో ప్రేమతో గారాబంగా పెంచుతుంటారు. ఈ సినిమాలోని అన్ని క్యారెక్టర్లు కూడా నిజమైన కుటుంబాలకు చాలా దగ్గరగా ఉంటాయి.

సినిమా స్టోరీ ఓ సాధారణమైనదిగా కనిపించినప్పటికీ ఇందులోని కుటుంబ సభ్యుల మధ్య బంధాలు అత్యంత సహజంగా చూపించారు. మీకు తారసపడిన ప్రతి మనిషిని కుటుంబ సభ్యులుగా భావించాలని ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగులు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. చాలా పరిపక్వత కలిగిన ఈ క్యారెక్టర్ సినిమా మొత్తం కూడా నవ్వుతూనే ఉంటుంది. ఇక అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మాండంగా చూపించారు. వీరిద్దరూ గొడవ పడడం.. తర్వాత కలుసుకోవడం వంటి సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. మహేశ్, సమంతల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు సైతం ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా అలరిస్తాయి.

ఇక పెళ్లి చూపుల సన్నివేశంలో వెంకటేష్, అంజలి ల మధ్య చోటు చేసుకునే సన్నివేశం హృదయాలను హత్తుకుంటుంది. మురళీమోహన్, ప్రకాష్ రాజ్ ల మధ్య చోటుచేసుకునే సన్నివేశాలు కూడా మనసులను పులకరింప చేస్తాయి. చాలా తక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామాను తెలుగు ప్రేక్షకులకు అందించిన శ్రీకాంత్ అడ్డాలను ఎంత పొగిడినా తక్కువే అని చెప్పవచ్చు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చేయకముందు దూకుడులో ఆల్ రౌండ్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ చేసి.. బిజినెస్ మ్యాన్ లో టెర్రిఫిక్ &యాంగ్రీ క్యారెక్టర్ లో దుమ్ము రేపారు మహేష్. తరువాత అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ డ్రామాలో నటించి కూడా రికార్డులను తిరగరాశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: