తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తన అందంతో ఒక్కసారిగా అందరినీ ఆకట్టుకుంది హీరోయిన్ కీర్తి రెడ్డి.  హిందీ తమిళ కన్నడ భాషలలో సైతం నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. గన్ షాట్ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈమె పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమాలో చేసిన పాత్ర ద్వారా మంచి గుర్తింపు పొందింది. హైదరాబాద్ లో 1978 వ సంవత్సరంలో జన్మించిన ఈమె తల్లి డిజైనర్ కాగా తాత మాజీ ఎంపీ. బెంగళూరులో తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత ఈమె ఎనిమిది సంవత్సరాల వయసులోనే భరతనాట్యంలో శిక్షణ పొందిది.

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన ఈమె సినిమాల్లో నటించాలన్న కోరిక తో సినిమా ప్రయత్నాలు చేయగా ఆమెకు తొలుత ఎస్ వి కృష్ణారెడ్డి ఛాన్స్ ఇచ్చారు. ఆయన దర్శకత్వంలోను గన్ షాట్ చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయింది. 1996లో సినిమా పరిశ్రమకు వచ్చిన తర్వాత ఆమెకు 97 లో తమిళ పరిశ్రమ నుంచి ఆఫర్ వచ్చింది. అక్కడ ఆమె నటించిన దేవతై సినిమా కీర్తి రెడ్డికి గొప్ప విజయాన్ని అందించింది. అంతేకాదు ఆమెకు మంచి పేరును కూడా తీసుకు వచ్చింది ఈ సినిమా. దాంతో అక్కడ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ఇక 2004లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ చిత్రంలోని హీరో అక్క పాత్రకు ఆమె ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ పురస్కారం అందుకుంది.  ఇకపోతే 2004లో ఈమె ప్రముఖ నటుడు సుమంత్ ను వివాహం చేసుకోగా అభిప్రాయ భేదాల కారణంగా 2006లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.  ఆ తర్వాత ఈమె లండన్ లో డాక్టర్ ను వివాహం చేసుకుంది ఇప్పుడు వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు. సుమంత్ ఇప్పుడు మరో పెళ్లి చేసుకోకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా ఆయన తన రీ ఎంట్రీ లో వరుస సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తెలుగులో కీర్తి రెడ్డి కి అర్జున్ సినిమా చివరి సినిమా. హీరోయిన్ గా ఆమె రావోయి చందమామ అనే సినిమాలో నటించి ఆ పాత్రలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ లో కొంతమేరకు రాణించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: