దక్షిణాది ఇండస్ట్రీని వసూళ్ల పరంగా చాలా చిన్న పరిశ్రమగా చూస్తుంటారు ట్రేడ్‌ పండిట్స్‌. అందుకే కన్నడకి ఎవరైనా హీరోయిన్లు వెళ్తున్నారంటే సెకండ్ ఇన్నింగ్స్‌ అన్నట్టుగా చూసేవాళ్లు. కానీ కన్నడ పరిశ్రమలో హీరోయిన్లకి డ్రగ్స్‌తో సంబంధం ఉందనే వార్తలతో శాండిల్‌వుడ్‌ టెన్షన్‌ పడింది. తెలుగులో 'బుజ్జిగాడు' లాంటి సినిమాలు చేసిన సంజన గల్రానీ డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయ్యింది. అప్పటివరకు పెద్దగా స్టార్డమ్‌ కూడా లేని హీరోయిన్‌ గురించి సౌత్‌ ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరిగింది. అంతేకాదు సంజన ఇంటరాగేషన్‌కి సహకరించడం లేదని ఈమెని చాలా రోజుల పాటు కస్టడీలోనే ఉంచింది కోర్టు.

నాని 'జెండాపై కపిరాజు' సినిమాతో తెలుగువారికి పరిచయం అయ్యింది రాగిణి ద్వివేది. తమిళ్, కన్నడ సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరోయిన్‌ కూడా డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ అయింది. అయితే వీళ్లు బెయిల్‌పై బయటకొచ్చాక కన్నడ ఇండస్ట్రీ కూడా ఈ డ్రగ్స్‌ వ్యవహారం నుంచి కుదుటపడింది. తెలుగు ఇండస్ట్రీలో కూడా డ్రగ్స్‌ ప్రకంపనలు సృష్టించాయి. స్టార్ డైరెక్టర్లు, హీరోలు ఈ డ్రగ్స్‌ కేసులో విచారణకి హాజరయ్యారు. మూడేళ్లకి పైగా సాగిన ఈ డ్రగ్స్‌ కేసుల్లో ఇటీవలే అందరికీ క్లీన్‌ చిట్‌ ఇచ్చారు నార్కోటిక్స్ అధికారులు.

టాలీవుడ్‌లో డ్రగ్స్‌ ఇంటరాగేషన్ కొన్ని సంవత్సరాల పాటు సాగింది. నాలుగేళ్ల క్రితం పూరీ జగన్నాథ్, ఛార్మి, ముమైత్ ఖాన్‌,  నందు, తనీష్, నవదీప్‌ లాంటి స్టార్స్‌ని ఇంటరాగేట్‌ చేశారు. ఆ సమయంలో టాలీవుడ్‌ మత్తులొ మునిగిపోతోందని, స్ట్రెస్‌ నుంచి బయటపడ్డానికి డ్రగ్స్‌ తీసుకుంటున్నారని ఇలా చాలా వార్తలు ప్రచారం అయ్యాయి. డ్రగ్స్‌ కేసులో ఈ ఏడాది కూడా టాలీవుడ్‌ స్టార్స్‌ని విచారించారు ఈడి అధికారులు. రవితేజ, రానా లాంటి స్టార్లు కూడా ఈ ఇంటరాగేషన్‌కి అటెండ్‌ అయ్యారు. అయితే లాంగ్‌ ఇంటరాగేషన్లు, భారీ ప్రచారాల మధ్యలో డ్రగ్స్‌కేసులో తెలుగు సినిమా స్టార్స్‌ అందరికీ క్లీన్ చిట్ వచ్చింది. తెలుగు, కన్నడ, హిందీ అనే తేడా లేకుండా అన్ని పరిశ్రమలని ఈ డ్రగ్స్ వ్యవహారం చుట్టు ముట్టడంతో సినీపెద్దలు చాలా ఫీలవుతున్నారు. డ్రగ్స్‌ కేసులతో ఇండియన్ సినిమా ఇమేజ్ దెబ్బతింటుందని వాపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: