దేశంలోకి కరోనా ఇంటర్ కాక ముందు మన దేశంలో చాలా తక్కువ మంది "ఓ టి టి" లో కంటెంట్ ను వీక్షిస్తూ ఉండేవారు . ఎప్పుడు అయితే కరోనా వచ్చిందో సినిమా హాల్స్ మూత పడ్డాయి. దానితో జనాలకు ఎంటర్టైన్మెంట్ ఆప్షన్స్ కరువు అయ్యాయి . ఇక ఇండ్లలో ఏ పని లేక ఖాళీగా ఉన్న జనాలు అంతా సినిమాలు చూడడానికి చాలా సమయాన్ని కేటాయిస్తూ వచ్చారు . అలాంటి సమయంలో కంటెంట్ కోసం జనాలు అంతా "ఓ టి టి" ల మీద పడ్డారు. దానితో కరోనా సమయం లో జనాలు "ఓ టి టి" కంటెంట్ ను ఎక్కువ ఇష్టపడడం మొదలు పెట్టారు.

దానితో ఇండియాలో ప్రస్తుతం ఈ బిజినెస్ పై ఎంతో మంది కన్ను వేశారు. ఇప్పటికే ఇండియాలో అత్యంత ప్రజాధరణ పొందిన ఎన్నో "ఓ టి టి" సంస్థలు ఉన్నాయి . ఇక పోతే వాటికి పోటీగా జియో సినిమా కూడా నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తుంది . ఇన్ని రోజుల పాటు భారీ ధరతో ఉన్న ఈ ప్రీమియం సబ్స్రిప్షన్ ధరను జియో సంస్థ ద్వారా తాజాగా భారీగా తగ్గించారు . తాజాగా జియో సినిమా సంస్థ వారు జియో సినిమా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ యొక్క నెలవారి సబ్స్రిప్షన్ ను కేవలం 29 రూపాయలుగా మాత్రమే కేటాయించింది.

కాకపోతే 29 రూపాయలు పెట్టినట్లు అయితే ఒకరు మాత్రమే ఇందులో ప్రీమియం కంటెంట్ ను చూడవచ్చు . అదే 89 రూపాయలు పెట్టినట్లు అయితే నాలుగు డివైస్ లలో ఒకే సారి ఒక నెల మొత్తం ప్రీమియం కంటెంట్ ను చూడవచ్చు. ఇలా చాలా తక్కువ ధరకే జియో సినిమా సబ్స్రిప్షన్ ను పొందే అవకాశాన్ని తాజాగా కల్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: