యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు గ్లోబల్ రేంజ్లో దమ్మున్న తెలుగు స్టార్ గా ఏదిగారు. ప్రస్తుతం ఆయన తెలుగులో కొరటాల డైరెక్షన్లో 'దేవర' మూవీతో బిజీగా ఉన్నారు. అలాగే బాలీవుడ్లో వార్-2 మూవీలో కూడా రీసెంట్ గా జాయిన్ అయ్యారు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఎన్టీఆర్ ఎక్కువగా విమానాశ్రయంలోనే ఎక్కువ కనిపిస్తున్నాడు.ప్రస్తుతం ఆ వీడియో హాట్ టాపిక్ గా మారిపోయింది.అయితే తాజాగా తారక్ వీడియో ఒకటి నెట్టింట హల్చల్ చేస్తుంది.అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరి మీద బాగా సీరియస్ ఐనట్లు తెలుస్తుంది.బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ సినిమా సీక్వెల్ వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తుంటే ఆయన వెంట ఫొటోగ్రాఫర్ లు వెంట పడుతూ ఉండడంతో ఒకసారిగా అసహనానికి గురయ్యాడు. ఏయ్ అంటూ ఎన్టీఆర్ అరుస్తూ ఉండడం కనిపిస్తోంది. బాలీవుడ్ లో ఈ పెపరాజీ ఫొటోగ్రఫీ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్లు ఎక్కడున్నా సెలబ్రిటీలను వదిలిపెట్టరు. వెంటపడి విసిగించైనా సరే పిక్స్ తీస్తుంటారు. అలాగే తారక్ ని కూడా క్యాప్చర్ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ముందుగానే తారక్ ఫొటోలు వద్దు అని చేతితో సైగ చేశాడు. కానీ, వినకుండా దగ్గరకు వెళ్లి క్లోజ్ గా షూట్ చేస్తుండటంతో.. అసహనంతో తారక్ వారిని ఓయ్ అని గట్టిగా అరిచాడు. ఆ తర్వాత లోపలికి వెళ్లిపోయాడు.తన మూవీ లుక్స్ రివిల్ కాకూడదని ఎన్టీఆర్ తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తుంటే ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

తారక్ బాలీవుడ్ డెబ్యూ కోసం చాలా మంచి ఛాన్స్ ఇది అని ఇప్పటికే చాలానే ప్రశంసలు దక్కాయి. పైగా స్పై యూనివర్స్ కాబట్టి హిందీ ఆడియన్స్ కి తారక్ మరింత దగ్గరవుతాడు అంటున్నారు. అలాగే తర్వాతి మూవీస్ లో తారక్ రోల్ బేస్డ్ గా ఒక ఫుల్ లెంగ్త్ మూవీ కూడా వస్తుంది అంటున్నారు. వార్ 2లో యాక్ట్ చేసినందుకు.. తారక్ కు రూ.100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అంటూ బాలీవుడ్ చాలానే వార్తలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: