నేటి రోజుల్లో వారసత్వ రాజకీయాలు అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఒక పార్టీ తరఫున పోటీ చేసి ఎన్నో పదవులను అలంకరించిన వ్యక్తి ఇక రిటైర్మెంట్ ప్రకటించే సమయంలో తమ వారసులను ఇక రాజకీయాలకు పరిచయం చేసి వారి రాజకీయ భవిష్యత్తును నిలబెట్టడం నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం. ఇలా తెలంగాణ రాజకీయాలలో కూడా ఎంతోమంది వారసులు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలలో ఇప్పటివరకు ఎన్నోసార్లు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక ఇప్పుడు మరికొన్ని రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక రాజకీయ ఉదండుడి మనవడు ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు అందరికి తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ   ఈయన ఎవరో కాదు కాకా గా పిలుచుకునే గడ్డం వెంకటస్వామి మనవడు. కాకా రాజకీయ ఉద్దండుడు అని చెప్పాలి. ఎందుకంటే ఏడు సార్లు ఎంపీగా గెలుపొందిన ఈయన రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా కూడా పనిచేసే సుదీర్ఘకాలం పాటు చట్టసభలకు ఎంపికై నేతగా పేరు గడించారు. 1957 నుంచి 1962 వరకు తొలిసారి ఎమ్మెల్యే అయ్యి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం  వహించిన ఆయన 1960లో నాలుగో లోక్సభకు తొలిసారి సిద్దిపేట పార్లమెంట్ నుంచి ఎన్నికయ్యారు. ఇక ఆ తర్వాత 1971 లో రెండోసారి 1977లో మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక తర్వాత కాలంలో మధ్యలో ఓసారి  రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగు పెట్టారు.


 1989లో నాలుగోసారి 1991 లో 5వ సారి 1996లో ఆరోసారి 2004లో ఏడోసారి ఎంపీగా గెలుపొందారు. కేంద్రంలో సహాయం మంత్రిగా ఇక రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇలా ఎన్నో పదవులను ఆయన అలంకరించారు. ఆ తర్వాత తన కొడుకు వివేక్ వెంకటస్వామి రాజకీయ భవిష్యత్తు కోసం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని కొడుకుకు మద్దతు పలికారు  అయితే ఇక వెంకటస్వామి కొడుకు వివేక్ వెంకటస్వామి 2009లో ఎంపిక ఎన్నికయ్యారు. ఇక ఇప్పుడు ఇంతటి రాజకీయ ఉద్దండుడి మనవడు వంశీకృష్ణ 2024 పార్లమెంటు ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా పెద్దపల్లి నుంచి పోటీ చేస్తూ ఉండటం గమనార్హం. భారీ  బ్యాగ్రౌండ్ తో బరిలో నిలిచిన ఈయన తాత, తండ్రి వారసత్వాన్ని నిలబెడతాడో లేదో చూడాలి?

మరింత సమాచారం తెలుసుకోండి: