ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల అధికారులు వినూత్నంగా  అవగాహన కల్పిస్తున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఖైరతాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో ఓటరు అవగాహన వైకుంఠపాళి పేరిట హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు అవగాహన కల్పించారు. ఓటుకు అమ్ముడు పోతే పాము మింగేస్తోందని విద్యార్థులకు వైకుంఠపాళి ఆట ఆడిపించి మరీ అధికారులు అవగాహన కల్పించారు.


ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి ఇలాంటి ఆటలతో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుకు డబ్బులు తీసుకోకుండా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. 100 శాతం ఓటింగ్ నమోదయ్యేలా చేసేందుకు తమ వంతు కృషిగా ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన ఓటు హక్కును ప్రజలందరూ తప్పకుండా వినియోగించుకోవాలని... హైదరాబాద్ జిల్లా డిప్యూటీ కమిషనర్, ప్రాజెక్ట్ అధికారి కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: