టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అందాలతారా శ్రీదేవి కూతురు జాన్వీకపూర్కి ప్రస్తుతం ఎన్టీఆర్ తో తెలుగు చిత్ర సీమ పరిశ్రమలోకి అరంగేట్రం చేయడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది.స్టార్ హీరో రామ్ చరణ్ తో కూడా RC 16 మూవీలో ఈ హీరోయిన్ నటించబోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే.చరణ్తో నటించడానికి సిద్ధమైనా జాన్వీను ఎప్పుడూ మా ప్రభాస్ అన్నతో నటిస్తావ్ అంటూ జనాలు సూటిగా ప్రశ్నించారు. దానికి సమాధానంగా అందరికి షాక్ ఇవ్వబోతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

అయితే ప్రభాస్ చేతిలో ఇప్పటికే కల్కి 2898 AD, సలార్ -2, స్పిరిట్,రాజా సాబ్ వంటి సినిమాలే కాకుండా క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా,హనూ రాఘవపూడి  దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తనని తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి దానికి అనుగుణంగానే ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకొని హను రాఘవవూడి కూడా స్టార్ డైరెక్టర్ గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో జాన్వీ కపూర్ కూడా సక్సెస్ సాధిస్తే తన కెరియర్ లో టాప్ హీరోయిన్ గా ముందుకు దూసుకెళ్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అయితే హను రాఘవపూడి ప్రభాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకున్నట్టు టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం.ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట వైరల్ కావడంతో ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.ఈ వైరల్ అవుతున్న న్యూస్ నిజం అయితే మాత్రం ఇంకా జాన్వీకి ఇండస్ట్రీలో తిరుగులేదని ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: