శ్రీలీలా.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా కొనసాగుతోంది. పెళ్లి సందడి అనే చిన్న సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇక మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు తనలో ఉన్న టాలెంట్ ఏంటో అందరికీ అర్థమయ్యేలా చేసింది. తన అందం అబినయంతో ఆకట్టుకోవడమే కాదు ఇక డాన్సులతో అందరిని ఫిదా చేసేసింది ఈ ముద్దుగుమ్మ. తన కొంటె చూపులతో కుర్ర కారు మతి పోగొట్టేసింది. అయితే పెళ్లి సందడి సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్గా మారిపోయింది శ్రీ లీల.


 ఇప్పటికే టాలీవుడ్ లో ఉన్న ఎంతోమంది స్టార్ హీరోలతో జోడి కట్టిన ఈ ముద్దుగుమ్మ.. బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. అయితే శ్రీ లీల  నటిస్తున్న మరికొన్ని సినిమాలు కూడా ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ హాట్ బ్యూటీ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న సినిమాలో శ్రీ లీలా ఛాన్స్ కొట్టేస్తుందట. అదేంటి ఈ సినిమాలో ఆల్రెడీ వేరే హీరోయిన్ సెలెక్ట్ చేశారు కదా అంటారా.. అయితే హీరోయిన్ పాత్ర కోసం కాదు ఏకంగా ఒక స్పెషల్ సాంగ్ కోసం ఛాన్స్ దక్కించుకుందట శ్రీలీల.



 ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే సినిమాలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో స్టార్ హీరోయిన్ శ్రీ లీల స్పెషల్ అప్పీరియన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఒక ఐటమ్ సాంగ్ లో దళపతి విజయ్ తో కలిసి కాలు కదపబోతుందట ఈ ముద్దుగుమ్మ. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే. యువన్ శంకర్ రాజా ఈ మూవీకి సంగీతం అందిస్తూ ఉండగా.. మీనాక్షి చౌదరి దళపతి విజయ్ కి జోడిగా హీరోయిన్గా నటిస్తోంది. ప్రభుదేవా సహా మరికొంతమంది నటులు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: