ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలను బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇక ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో చూసిన మూడు పార్టీలే ప్రధాన పోటీదారులుగా కనిపిస్తున్నాయి. కానీ ఒక్కచోట మాత్రం ఇక బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గెలుపును లైట్ తీసుకుంటే.. అటు బిజెపి మాత్రం గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తుంది. అదే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. మజిలీస్ పార్టీ కంచుకోటగా పిలుచుకునే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో ఇప్పటివరకు ఓవైసీ ని ఓడించిన వారు లేరు.


 దీంతో అక్కడ పోటీ చేసి సమయం వృధా చేసుకోవడం ఎందుకు అని మిగతా పార్టీలు హైదరాబాద్లో పోటీని విరమించుకుంటాయ్. లేదంటే డమ్మీ అభ్యర్థిని నిలబెట్టి లోలోపల మాత్రం మజిలీస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తూ ఉంటాయి అన్నది తెలంగాణ రాజకీయాల్లో ఉన్న వాదన. కానీ ఇప్పుడు బీజేపీ మాత్రం మజిలీ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టి అక్కడ కాషాయ జెండా ఎగరేయాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే అక్కడ బిజెపి తరఫున మాధవి లతను బరిలోకి దింపింది అన్న విషయం తెలిసిందే. అయితే ఆమె హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఓటర్లకు స్పష్టమైన హామీలు ఇస్తూ ప్రచార రంగంలో దూసుకుపోతున్నారు.


 ఈ క్రమంలోనే ప్రస్తుతం హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎన్నికల పోరు ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది. ఇక అక్కడ కైట్ ఫైట్ నడుస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కి పోటీగా బిజెపి తరఫున బరులోకి దిగిన మాధవి లత రామబాణం వేసినట్లు గాలిపటాన్ని (ఎంఐఎం గుర్తు) తెంచేసినట్లు ఇక హావభావాలను పలిపిస్తూ ప్రచారంలో చేతులకు పని చెబుతున్నారు. ఇంకోవైపు అటు ఓవైసీ సైతం గాలిపటాన్ని ఎగరవేస్తున్నట్లు సైగలు చేస్తూ ఇక మాధవి లతకు కౌంటర్ ఇస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు అని చెప్పాలి. ఇలా ప్రస్తుతం హైదరాబాద్ నియోజకవర్గంలో అటు కైట్ ఫైట్ నడుస్తోంది. కాగా మాధవి లత ఎంఐఎం కు టఫ్ ఫైట్ ఇస్తుండగా ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: