గత కొన్ని నెలలలో షర్మిల తన ప్రచారంలో భాగంగా జగన్ పై ఏ స్థాయిలో విమర్శలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇంతకాలం జగన్ షర్మిల గురించి నెగిటివ్ గా ఎలాంటి కామెంట్లు చేయలేదు. అయితే జగన్ తన ప్రచారంలో భాగంగా షర్మిల కొడుకు పెళ్లికి ప్రముఖ నేతలను ఆహ్వానించే సమయంలో పచ్చ చీరను ధరించారని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు షర్మిలకు కోపం తెప్పించాయి.
 
జగన్ ఒక్క మాట అంటే షర్మిల ఏ స్థాయిలో ఫీలైపోయారంటే జగన్ తనపై అభాండాలు మోపారని తన దుస్తుల గురించి ప్రస్తావిస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కామెంట్లు చేశారు. నా దుస్తుల గురించి మాట్లాడుతున్నారంటే సభ్యత ఉందని అనుకోవాలా అంటూ షర్మిల కామెంట్లు చేయడం జరిగింది. అయితే షర్మిల అన్న విమర్శలను లైట్ తీసుకుంటే బాగుండేదని ఇంత సీరియస్ స్పందన అవసరమా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
షర్మిల ప్రజలకు మేలు చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారా? లేక జగన్ ను టార్గెట్ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారా? అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఏపీలో కాంగ్రెస్ ఒక స్థానంలో కూడా గెలవడం కష్టమని గత ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్ల శాతం కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు వచ్చే ఛాన్స్ లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సొంత చెల్లెలి చీరపై జగన్ మాట్లాడటం సంస్కారమా అని కామెంట్లు చేసిన షర్మిల జగన్ పై ఏ స్థాయిలో విమర్శలు చేశారో గుర్తు పెట్టుకుంటే మంచిది.
 
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నామంటే విమర్శలకు సైతం తట్టుకునే గుణంగా ఉండాలి. ప్రతి విమర్శకు కౌంటర్లు ఇస్తూ అడుగులు వేస్తే రాజకీయాల్లో ఎప్పటికీ సక్సెస్ సాధించే ఛాన్స్ ఉండదు. జగన్ షర్మిలపై విమర్శలు చేయకపోతే జగన్ తప్పు చేశాడని అందుకే విమర్శలు చేయడం లేదని కామెంట్లు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. జగన్ వెళ్తోంది సరైన మార్గమే అని జగన్ ను నిందించాల్సిన అవసరం లేదని నెటిజన్లు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: