
ఈ సీరియల్ లో తాను చేసిన సౌందర్య పాత్రకు మంచి పేరు వచ్చింది. సినిమా నటులు కూడా ఈ సీరియల్ ను చాలా బాగా ఇష్టపడుతారు. అంతే కాకుండా ఈ సీరియల్ ద్వారానే మరి కొన్ని సీరియల్స్ అర్చన సొంతం చేసుకుంది. అయితే ఈమె ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కల తీరే సమయం వచ్చిందంటున్నారు సినిమా వర్గాలు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒక యంగ్ హీరో సినిమాలో తల్లి పాత్ర కోసం ఈమెను ఎంపిక చేసుకున్నారట, ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగినట్లు సమాచారం.
ఒక్క మంచి పాత్ర చాలు నటిగా మంచి పేరు తెచ్చుకోవడానికి, అందుకే నటించడానికి ఒప్పుకుందట అర్చనా అనంత్. మరి సినిమా ఏమిటో? ఆ హీరో ఎవరు అన్న తదితర వివరాలు ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికి ఇది ఒక గాసిప్ లానే ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. ఒక వేళ ఈ సినిమా అవకాశం నిజం అయితే ఇందులో తన పాత్ర ఎలా ఉండనుందో అన్నది చూడాలి.