HIV వైరస్.. ఎయిడ్స్ వ్యాధి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎయిడ్స్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని మన అందరికి తెలిసిందే. ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన వ్యాధులలో ఈ ఎయిడ్స్ కూడా ఒకటి. ఈ ఎయిడ్స్ అనే వ్యాధి గత కొన్ని దశాబ్దాలుగా ప్రజలను వణికిస్తుంది అనడంలో సందేహం లేదు. ఫస్ట్ లో ఎయిడ్స్ వ్యాధి హెచ్‌ఐవీ ఉన్న వారితో శృంగారం చేస్తేనే వస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఆ తరువాత ఇది రక్తం, తల్లిపాలు వంటి పలు మార్గాలు ద్వారా కూడా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి కనిపెట్టారు. hiv సెల్స్ యొక్క dna లోకి చేరుతుంది కాబట్టి ఎవరికైన ఒకసారి ఈ వైరస్ సోకితే అది జీవితాంతం ఉంటుందట. దురదృష్టం ఏమిటంటే..ఇప్పటి వరకు దానికి క్యూర్ లేదు. ప్రపంచవ్యాపతంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఈ వైరస్ ని అంతం చేయడానికి మందును కనుగొనడానికి పరిశోధనలు చేస్తునే ఉన్నారు.

 ఇప్పటిదాకా ఈ ఎయిడ్స్ వ్యాధి బారిన పడి సుమారు 3.7 కోట్ల మందికి పైగా ప్రాణాలను విడిచిన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. గత రెండెళ్లల్లో దాదాపు పది లక్షల మంది వరకు  ఈ  హెచ్‌‌ఐవీ సంబంధిత వ్యాధుల కారణంగా మరణించిన్నట్లు  అధికార లెక్కలు  చెబుతున్నాయి. అంతేకాదు ప్రస్తుతం సుమారు 3.7కోట్ల మంది ఈ హెచ్‌ఐవీతో జీవిస్తున్నారట. ఆశ్చర్య ఏమిటంటే అందులో 70శాతం మంది ఆఫ్రికాలోనే ఉండడం అందరిని  షాక్ కు గురిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని బలి తీసుకుంటున్న ఈ హెచ్‌ఐవీ బారిన పడి చాలా మంది సెలబ్రిటీలు కూడా మరణించారు. ఈ విషయం చాలా తక్కువ మందికే  తెలుసు. ఇప్పుడు ఇక్కడ అలా ఎయిడ్స్ వ్యాధి తో మరణించిన హీరో హీరోయిన్ లు ఎవరో తెలుసుకుందాం..!!

అగ్ర రాజ్యం అమెరికాకు చెందిన స్టార్ హీరో బ్రాడ్ డేవిస్ అనే వ్యక్తికి 1987వ సంవత్సరంలోనే ఈ ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డారు. అయితే  ఈ వ్యాధిని తగ్గించడానికి మందు లేకపోవడంతో..ఇండస్ట్రీలో అందరు చిన్న చూపు చూడడంతో ఆ హీరో సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఇక తమిళనాడు కు చెందిన హీరోయిన్  నిషా నూర్ కూడా ఎయిడ్స్ వ్యాధి బారిన పడి మరణించారు. ఒక్క సినిమాలో నటించిన ఈ హీరోయిన్ ను ఓ స్టార్ ప్రోడ్యూసర్ మోసం చేయడంతో..వేరే మార్గం లేక   వ్యభిచార వృత్తి లోకి దిగి.. చివరికి ఎయిడ్స్ వ్యాధితో చనిపోయిందని అప్పట్లో వార్తలు హల్ చల్ చేసాయి.వీరితో పాటు పెడ్రో అనే సెలబ్రిటీ కూడా ఎయిడ్స్ వ్యాధి బారిన పడి మృతిచెందిన్నట్లు తెలుస్తుంది.  ఇలా ఎంతో మంది స్టార్ సెలబ్రిటీస్ సినీ ఇండస్ట్రీలో ఎయిడ్స్ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కాగా ప్రస్తుతం ఎయిడ్స్ వ్యాధికి చికిత్స లేకపోయినా.. నివారణ ద్వారా పూర్తిగా ఈ వ్యాధిని అరికట్టవచ్చు అని శాస్త్రవేత్తలు నిపుణులు చెప్పుకొస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: