మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో... ఎన్నో భారీ అంచనాల మధ్య వస్తోంది త్రిపుల్ ఆర్ సినిమా.  మన టాలీవుడ్ పరిశ్రమ ప్రేక్షకులే కాకుండా వరల్డ్ వైడ్ గా ఎదురు చూస్తున్నా భారీ సినిమా ఇదే కావడం విశేషం. ఈ త్రిపుల్ ఆర్... సినిమాను ఎంతో బ్రహ్మాండంగా మరియు ఎవరూ ఊహించని రీతిలో తెరకెక్కిస్తున్నారు టాలీవుడ్ సంచలన దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి. బాహుబలి ఒకటో భాగం మరియు బాహుబలి రెండో భాగం ఎంతో బ్రహ్మానండమైన విజయం సాధించిన తర్వాత.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టారు ఈ సంచలన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి.  

ఇక ఈ సినిమాలో టాలీవుడ్ బిగ్గెస్ట్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఇది. ఎవరూ ఊహించని రీతిలో అతి పెద్ద బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమా లో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతో పెద్ద నటులు కూడా ఇందులో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ లు, పోస్టర్లు మరియు టీజర్లు మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమ యొక్క ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో అతి పెద్ద అప్డేట్ రావడం గమనార్హం. 

తాజాగా ఈ సినిమాలోని నాటు నాటు అనే వీడియో సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఇందులో ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి డాన్స్ చేసి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. ఈ పాటలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఫుల్ ఎనర్జీ గా డాన్స్ చేశారు.  ఎన్టీ ఆర్ మరియు రామ్ చరణ్ డాన్స్ చేస్తుంటే అటు బ్రిటిష్ కు చెందిన నేతలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంకా ఈ పాట వింటుంటే మన రోమాలు ని లి చి న ట్లు అనిపిస్తోంది.  ఇక ఈ పాటను చంద్ర బోస్ చాలా అద్భుతంగా రాశారు. మొదటి సింగిల్ కంటే సెకండ్ సింగిల్ ఎం దరి నో ఆ క ట్టు కుం టోం ది.


మరింత సమాచారం తెలుసుకోండి: