తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నా కూడా రోజుకు ఓ కొత్త హీరో తెర పైకి ఇంట్రీ ఇస్తుంటారు. అతి చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా హీరో ఖచ్చితంగా ఉండాల్సిందే . ఇక టాలీవుడ్ లో ఉన్న ఒక్కో హీరో కి ఒక్కో రేంజ్ , క్రేజ్ ఉంది. ప్రతి ఒక్కరికి వాళ్లకు తగ్గ రేంజ్ లోనే అభిమానులు ఉన్నారు. కానీ ఇండస్ట్రీకి వచ్చిన అనతికాలంలోనే ఎక్కువ క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ అనే అంటారు అభిమానులు.

విజయ్ పేరు చెప్పితే అభిమానులకి ఎక్కడ లేని ఊపువస్తుంది. విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్ పర్ ఫామెన్స్ ఇచ్చినా..అర్జున్ రెడ్డి సినిమా లో మాత్రం ఇరగదీసాడు. ఇక ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే బిగ్గేస్ట్ హిట్ గా నిలవడంతో పాటు..భారీ సంఖ్యలో అభిమానులను కూడా తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఈయనకు గర్ల్స్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పాలి. యంగ్ గర్ల్స్ కు ఈయన అంటే క్రష్. ఈ విషయాని అమ్మాయిలు సోషల్ మీడియా వేదికగా పలుసార్లు వ్యక్తం చేసారు. ఇక రీసెంట్ గా ఓ  బడా హీరోయిన్ అయితే ఈ యంగ్ హీరో హాట్ గా ఉంటాడంటూ అందరి ముందే చెప్పేసింది.

బాలీవుడ్‌ హాట్ బ్యూటీ సారా అలీ ఖాన్‌..ఓ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ   టాలీవుడ్‌కు చెందిన విజయ్ దేవరకొండ ను పొగడ్తలతో ముంచెత్తింది. అటట్రాంగి రే చిత్రం మూవీ ప్రమోషన్స్‌లో పాల్గోన్న  సారా తనకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ క్రమంలో  దక్షిణాదిలో ఏ హీరోతో మీరు పని చేయాలి అనుకుంటున్నారు అని  అడగ్గా..   వెంటనే అమ్మడు తడుముకోకుండా ఆలోచించుకోకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు చెప్పేసింది.  అంతేకాదు అక్కడితో ఆగకుండా విజ‌య్ దేవ‌ర‌కొండ చాలా చాలా హాట్‌గా ఉంటాడు అని తన మనసులోని మాటను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం విజయ్ పూరీ డైరెక్షన్ లో లైగర్ అనే మూవీ చేస్తున్నాడు అన్న విషయం మనకు తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: