క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కొండపొలం సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. మెజారిటీ ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చలేదు కానీ ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రం తప్పకుండా నచ్చుతుంది. ఏరికోరి మరీ క్రిష్ ఓ నవలను సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే దానికి సరైన స్పందన రాకపోవడంతో ఆయన కూడా ఎంతో నిరాశ పడ్డారు. దాంతో ఆయన తన తదుపరి సినిమా పనుల్లో కి వెళ్ళిపోయాడు.

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నవలలను సినిమాగా తెరకెక్కించడం కొత్తేమీ కాదు. ఎన్నో గొప్ప గొప్ప నవలలు సినిమాలుగా చేయగా అవి మంచి విజయం సాధించాయి. ఇటీవల కాలంలో నవలలను తెరకెక్కించడం తగ్గినా క్రిష్ కొండ పొలం సినిమా తో మళ్ళీ ఆ ట్రెండ్ మొదలు పెట్టారని చెప్పవచ్చు. తాజాగా ఆయన మరో నవలను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే ఈసారి సినిమాగా కాకుండా వెబ్ సిరీస్ రూపంలో ఆ నవలను తీర్చిదిద్దాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ నవలకు సంబంధించిన సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ ను చేయడానికి ఇప్పటికే ఆయన రంగం సిద్ధం చేశారు. ఇంతకీ ఆ నవల ఏమిటి అంటే తెలుగు నవలా ప్రపంచంలో నే కన్యాశుల్కం నవలకు మంచి పేరు ఉంది. అప్పటి సాహిత్యం కథ కథనాల గురించి మాట్లాడితే తప్పకుండా ఈ నవల పేరు చర్చకు వస్తుంది. అలాంటి ఈ నవలను సినిమా గా మార్చాలని చూస్తున్నా క్రిష్ దాంతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడు అనేది చూడాలి. ప్రస్తుతం క్రిష్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఈ సినిమా ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: