విన్మీంగల్ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ అలాగే మాస్కోవిన్ కావేరి కలసి నటించిన మలయాళం చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అయితే ఈ సినిమాను తమిళ్ లో ది గ్రేట్ ఇండియన్ కిచెన్ పేరుతో రీమేక్ గా రూపొందించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో సూరజ్ వెంజరమూడు పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఇకపోతే తమిళ దర్శకుడు కన్నన్ కూడా ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెలుగులో రూపొందించడానికి సిద్ధమవుతున్నాడు.. ప్రముఖ సింగర్ గా గుర్తింపు పొందిన చిన్మయ్ భర్త గా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ తెలుగులో కూడా కొన్ని సినిమాలలో నటించాడు. ఇక అలా ప్రేక్షకులకు సుపరిచితుడు కావడంతో ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం.

కేవలం నటుడు మాత్రమే కాదు తాను దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కూడా ఉత్తమ స్క్రీన్ ప్లే కి జాతీయ అవార్డును కూడా అందించింది ఈ సినిమా. ఇకపోతే ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయగా మంచి ప్రేక్షకాదరణ లభించడం గమనార్హం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేస్తామని ఒక పోస్టర్ ను విడుదల చేస్తూ చిత్రం యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

పోస్టర్ లో  ఐశ్వర్య రాజేష్ ఏదో వంట వండుతూ ఉండగా ఆప్యాయతగా రాహుల్ వెనుకనుంచి కౌగిలించుకున్న ఒక అద్భుతమైన సన్నివేశాన్ని మనం ఈ పోస్టర్ లో గమనించవచ్చు. ఇకపోతే ఈ పోస్టర్ చూస్తే ఈ సినిమా చాలా అద్భుతంగా గీతాగోవిందం సినిమా ను తలపించేలా ఉంది అని కొంతమంది అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. అంతే కాదు దాంపత్య జీవితం అంటే ఇలాగే ఉండాలని మరికొంతమందికి గుణపాఠం చెప్పేలా ఉంటుందని మరి కొంత మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం గమనార్హం. ఏది ఏమైనా ఈ ట్రైలర్ కోసం అయితే ప్రేక్షకులు చాలా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: