రెజీనా కసాండ్రా.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా ద్వారా తెలుగు తెరపై మంచి పేరు ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఈ సినిమాతోనే మంచి ప్రేక్షకాదరణ పొందింది. రెజీనాని అందరూ ముద్దుగా టీనా అని పిలుచుకుంటూ ఉంటారు. 1990 డిసెంబర్ 13వ తేదీన చెన్నైలో జన్మించిన రెజీనా ప్రస్తుతం 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక ఈమె విద్యాభ్యాసం విషయానికి వస్తే చెన్నైలో ఉన్న గుడ్ షెఫర్డ్ హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఇక చెన్నై లో వున్న ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజీ లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లో సైకాలజీ పూర్తి చేసింది.

ఇక వరుస సినిమాలతో బిజీగా వున్న రెజీనా స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతోంది. చిన్నప్పటినుంచి భరత నాట్యం నేర్చుకుంటూ నటనపై ఆసక్తిని పెంచుకుంది. మొదటిసారి 2005లో తమిళ్ మూవీ అయినా కందా నాల్ ముదల్ అనే సినిమాలో హీరోయిన్ లైలా కి చెల్లెలి పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె ఆ తర్వాత తాతినేని సత్య దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా శివ మనసులో శృతి అనే సినిమా ద్వారా 2012 లో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2014లో పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది.

ఇక ఈమె సినిమాల ద్వారా పోగు చేసిన ఆస్తుల విషయానికి వస్తే.. టయోట ఇన్నోవా క్రెస్టా కార్లు కూడా ఈమె కొనుగోలు చేసింది. ప్రస్తుతం దీని ధర రూ.23.60 లక్షలు. ఇక ఇంటి విషయానికొస్తే చెన్నై లో వున్న ఏలియన్స్ ఆర్చిడ్ స్ప్రింగ్స్ అపార్ట్మెంట్స్ లో జీవిస్తోంది. ప్రస్తుతం ఈ అపార్ట్ మెంట్ లో వున్న ఇంటి ధర సుమారుగా 90 లక్షల రూపాయలు. ఇక ప్రస్తుతం ఈమె ఒక్కో సినిమాకు రూ. 75 లక్షలు తీసుకుంటోంది. ఇక అలా డబ్బు పోగు చేయడంలో రెజీనాదే పైచేయి అని ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: