అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీసిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన పుష్ప లో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పాలి. అనసూయ, సునీల్, ధనుంజయ, శత్రు, అజయ్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ సినిమాలో శ్రీవల్లి గా హీరోయిన్ రష్మిక మందన్న నటించారు.

ఆ పాత్రలో ఆమె నటనకి అందరి నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక పుష్ప ని అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా తీయడంలో దర్శకుడు సుకుమార్ పూర్తిగా సఫలం అయ్యారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ తరువాత దాదాపుగా అన్ని భాషల్లో కూడా పుష్ప బాగా కలెక్షన్ రాబట్టింది. అంతకముందు అలవైకుంఠపురములో మూవీతో పెద్ద సక్సెస్ కొట్టి ఆ సినిమా సాంగ్స్ తో జాతీయ స్థాయి గుర్తింపు అందుకున్న అల్లు అర్జున్ కి పుష్ప సక్సెస్ మరింతగా ఊపునిచ్చింది. ఇక త్వరలో ఈ సినిమాకి సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కనుంది.

అయితే విషయం ఏమిటంటే ఈ సినిమాకి సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ ఎంత బాగా పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే. కాగా ఈ సాంగ్స్ నేటితో యూట్యూబ్ లో ఏకంగా అన్ని భాషల్లో కలిపి 1 బిలియన్ వ్యూస్ దక్కించుకోవడం గొప్ప విశేషం అంటున్నారు పుష్ప మూవీ యూనిట్. ముఖ్యంగా యువత తో పాటు మాస్ ఆడియన్స్ పుష్ప సాంగ్స్ ని ఎంతో ఆదరించారని, ఇంకా ఈ సాంగ్స్ యూట్యూబ్ లో అదరగొడుతూ దూసుకెళ్తున్నాయని అంటున్నారు. ఓవైపు సినిమా, మరోవైపు సాంగ్స్ ఇలా పుష్ప అన్ని విధాలుగా అదరగొడుతుండడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అమితానందం వ్యక్తం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో పుష్ప ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: