బాహుబలి రెండు భాగాల సినిమాలతో హీరోగా అమాంతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్, మార్కెట్ దక్కించుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వాటి తరువాత సాహో మూవీ ద్వారా ప్రేక్షకాభిమానుల ముందుకు వచ్చారు. అయితే ఆ మూవీ మన తెలుగులో పెద్దగా ఆడనప్పటికీ నార్త్ లో మాత్రం కలెక్షన్స్ అదరగొట్టింది. ఇక దాని తరువాత ప్రభాస్ చేసిన సినిమా రాధేశ్యామ్.

మూడేళ్ళ క్రితం ఎంతో భారీ ఎత్తున ప్రారంభం అయి ఇటీవల షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న రాధేశ్యామ్ మూవీ, మొత్తంగా పలుమార్లు వాయిదా పడి వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది. యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. వరుస సక్సెస్హీరోయిన్ పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రభాస్, విక్రమాదిత్య అనే హస్త సాముద్రిక నిపుణుడి పాత్ర చేసారు. థమన్ బీజీఎమ్ అందించిన ఈ పాన్ ఇండియా మూవీ సౌత్ వెర్షన్స్ కి జస్టిన్ ప్రభాకరన్, హిందీ వర్షన్ కి మన్నన్ మిథూన్ మ్యూజిక్ కంపోజ్ చేసారు. అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచి నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చిన రాధేశ్యామ్ పై ప్రస్తుతం ఒకింత మిశ్రమ స్పందన వస్తోంది.

ముఖ్యంగా దర్శకుడు రాధాకృష్ణ సినిమా కోసం ఎన్నుకున్న పాయింట్ బాగుందని, హీరో హీరోయిన్స్ తో పాటు సినిమాలోని పాత్రలు అన్ని కూడా ఆకట్టుకున్నప్పటికీ మధ్యలో చాలా చోట్ల కథనంలో పలు లోపాలు కనిపించాయని, మంచి రొమాంటిక్ లవ్ ఎమోషనల్ సీన్స్ బాగే తీసిన దర్శకుడు రాధా కామెడీ, ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ అంశాలు మాత్రం మిస్ చేసారని అంటున్నారు. పక్కాగా చెప్పాలి అంటే రాధేశ్యామ్ ఎక్కువ శాతం క్లాస్ ఆడియన్స్ కి మాత్రమే కనెక్ట్ అవుతుందని, ఇక సినిమాలో ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొన్ని చోట్ల నెమ్మదించిందని, మొత్తంగా ఇది గతంలో వచ్చిన పలు సినిమాల మాదిరి ఒక ఫక్తు లవ్ స్టోరీ తప్ప పెద్దగా కొత్తదనం అయితే ఏమి కనిపించలేదని మరికొందరు అంటున్నారు. కాగా ఓవరాల్ గా రాధేశ్యామ్ లో హీరోయిన్ హీరో పెర్ఫార్మన్స్ భారీ విజువల్స్, బీజీఎమ్, గ్రాండియర్ టేకింగ్ వంటివి మాత్రమే ఆకట్టుకుంటాయని చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో రాధేశ్యామ్ ఎంతవరకు ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: