ఎస్.ఎస్.రాజమౌళి సక్సెస్ కు మారు పేరు. ఒక బ్లాక్ బస్టర్ వస్తే ఆకాశానికెత్తేసే జనం, వరుస ప్లాపులు రాగానే మర్చిపోతారు. కానీ గత 20 ఏళ్లలో ఏడుగురు హీరోలతో 12 సినిమాలు,అన్ని సూపర్ హిట్ సినిమాలే ఇది ఎస్.ఎస్.రాజమౌళి లెక్క. ఎడిటింగ్ నుంచి, యాడ్ ఫిలిం డైరెక్టర్ ఆ తర్వాత సీరియల్ డైరెక్టర్ గా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వచ్చారు రాజమౌళి. భారత చలన చిత్ర రంగంలోనే తనదైన బ్రాండ్ వేసిన దర్శకుడు రాజమౌళి.ఇంటర్ తర్వాత ఏమవుతావంటే డైరెక్టర్ అవుతానని తండ్రికి చెప్పిన రాజమౌళి,మొదట మిగతా శాఖల్లో అనుభవం సంపాదించమన్న తండ్రి సలహా తో ఎడిటింగ్ నేర్చుకున్నారు. తర్వాత మిగతా వాటి పై పట్టు సాధించి రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ గా చేరారు. తర్వాత రాఘవేంద్రరావు గైడెన్స్ తో కొన్ని ప్రకటనలకు పనిచేసిన రాజమౌళి, రాఘవేంద్రరావు ఈటీవీ కోసం నిర్మించిన శాంతినివాసం సీరియల్ తో దర్శకుడిగా మారారు. స్టూడెంట్ నెం.1  సినిమా తో టాలీవుడ్ దర్శకుడు కావాలన్న తన కలను నిజం చేసుకున్నారు. ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ రాఘవేంద్రరావు చేశారు. ఈ సినిమాను ఎన్టీఆర్, రాజమౌళి ఇద్దరు ఒకరికొకరు ఛాన్స్ ఇచ్చుకోవడం లాగానే భావిస్తారు. మళ్లీ ఎన్టీఆర్ తోనే సింహాద్రి సినిమా తీసారు.

సై మూవీ లో కాలేజ్ దోస్తీని, లోకల్ రాజకీయాలను రగ్బి ఆటతో ముడిపెట్టి యూత్ లో క్రేజ్ తెచ్చుకున్నారు. తర్వాత ఛత్రపతి సినిమాలో ప్రభాస్ మాస్ ఇమేజ్ ను మదర్ సెంటిమెంట్ తో మిక్స్ చేసి మరో సక్సెస్ అందుకున్నారు. విక్రమార్కుడు లాంటి పక్కా మాస్ సినిమాకు,పవర్ ఫుల్ పోలీస్ స్టోరీని ఆడ్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న రాజమౌళి తర్వాత ఏడాదే తన లక్కీ హీరో ఎన్టీఆర్ తో యమదొంగ సినిమా తీసి టోటల్ గా 6వ హిట్ అందుకున్నారు రాజమౌళి. రాజమౌళికి స్టార్ డైరెక్టర్ ఇమేజ్ ని తెచ్చిన మూవీ మగధీర. ఈ సినిమాను తెరకెక్కించడానికి 15 సంవత్సరాలు వెయిట్ చేశారు. ఆ తర్వాత సునీల్ తో మర్యాద రామన్న సినిమా అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. రాజమౌళి కెరీర్లో ఇప్పటివరకు భారీ మూవీగా నిలిచింది బాహుబలి. స్టార్డమ్ కన్నా కథే ముఖ్యం అని బలంగా నమ్ముతారు రాజమౌళి. ఆయన రెమ్యూనరేషన్ ఎంత అనేది అభిమానులకు ఒక అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోయింది. కానీ ఆయన లాభాల్లో పర్సంటేజ్ ని మాత్రమే తీసుకుంటారట.

మహాభారతం తీయాలనేది ఒకవిధంగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని రాజమౌళి ఎన్నోసార్లు చెప్పారు. తన మనసులో అనుకున్నట్టు దానిని తీస్తే అది కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆర్ఆర్ఆర్ విడుదలయ్యాక కాస్త టైమ్ తీసుకుని మహేష్ బాబుతో తెరకెక్కించే సినిమాకోసం కథాచర్చలు ప్రారంభించాలని అనుకుంటున్నట్లు రాజమౌళి తెలియజేశారు. ఈగ సినిమా అనౌన్స్ చేసినప్పుడు అందరూ షాక్ అయ్యారు. ఈ సినిమా చేసినప్పుడు ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. సినిమాలు తీయడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటారని, దానివల్ల నటీనటుల కాల్షీట్లు బ్లాక్ అయిపోతాయననే విమర్శలు కూడా రాజమౌళి మీద  ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: