పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న  తాజా సినిమా లో హరి హర వీరమల్లు ఒకటి. ఈ సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనుంది.అయితే ఈ సినిమా భారీ బడ్జెట్‌తో  అగ్ర నిర్మాత ఏ ఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా అంతేకాకుండా , బాలీవుడ్ స్టార్స్ నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో కనిపిచబోతున్నారు.ఇకపోతే ఈ సినిమాకి  ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తైన వీరమల్లు తాజా షెడ్యూల్ ఏప్రిల్ 6 నుంచి ప్రారంభం కానుందట. అంతేకాదు పద్మశ్రీ తోట తరణి ఆధ్వర్యంలో ఇప్పటికే భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోంది.

అంతేకాకుండా ఇప్పుడు ఈ సెట్స్ పూర్తి కావచ్చాయట.అయితే ఇక్కడే లాంగ్ షెడ్యూల్‌ను చిత్రబృందం కంప్లీట్ చేయనుంది. అంతే కాదు మరో నాలుగు నెలల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ కి చెప్పినట్లు సమాచారం. ఇక రీ ఎంట్రీ తర్వాత వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ఇప్పుడు ఈ సారి భారీ పాన్ ఇండియన్ సినిమా 'హరిహర వీరమల్లు'తో కొత్త రికార్డులు నమోదు చేయడానికి పక్కాగా రెడీ అవుతున్నారు. అయితే తాజాగా ఇప్పుడు వచ్చిన ఆర్ఆర్ఆర్ తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ఇకపోతే మళ్ళీ ఆ స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కొత్త హిస్టరీ క్రియేట్ చేయాలంటే వీరమల్లు మూవీతో పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమని మెగా అభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే దీనికి కారణం గత ఏడాది వచ్చిన టీజర్ సినిమాపై భారీ స్థాయిలో అనచనాలు పెంచడమే. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న భవదీయుడు భగత్ సింగ్ షూటింగ్లో కూడా పవన్ పాల్గొననున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: