యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్ ఇప్పటికే దాదాపుగా 750 కోట్ల కలెక్షన్ మార్క్ దాటి1000 కోట్లకు చేరువలో ఉన్నది.


దీంతో 'ఆర్ఆర్ఆర్' టీం సినిమా విజయాన్ని పురస్కరించుకుని తాజాగా ముంబైలో సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు. ఈ వేడుకకు అమీర్ ఖాన్ చీఫ్ గెస్టుగా హాజరై రాజమౌళిపై ఎన్నో ప్రశంసలు కురిపించాడు. ఇక ఈ ఈవెంట్ లో ఒక ముంబై విలేఖరి నుండి ఊహించని ప్రశ్న ఎదురైందట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఏదైతే వినపడకూడదో అదే వినిపించిందట.ఆర్ఆర్ఆర్ విడుదలైనప్పటి నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనంలో ఉన్నారనేది ఒప్పుకోవాల్సిన నిజమే. చరణ్ పాత్రకు మించి ఎన్టీఆర్ రోల్ ఉంటుందని అందరూ కూడా ఊహించారు. ప్రోమోలు కూడా ఆ తరహా అంచనాలే కలిగేలా చేశాయి. తీరా సినిమా చూస్తే రామ్ చరణ్ సినిమాలో వీరవిహారం చేశారు. రాజమౌళి అధిక ప్రాధాన్యత ఆ పాత్రకు ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని బాలీవుడ్ మీడియా కూడా లేవనెత్తడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఒకే వేదికపై ఉండగా రిపోర్టర్ అత్యంత ఇబ్బందికరమైన ప్రశ్న అడిగారట.. సినిమాలో మీరు బాగా హైలెట్ అయ్యారు. మీ పాత్ర ఎలివేట్ అయ్యిందంటున్నారు.. దానికి మీ సమాధానం ఏమిటని రామ్ చరణ్ ని ప్రశ్నించారట.. చరణ్ వెంటనే స్పందిస్తూ "అది అస్సలు నిజం కాదు. నేను దానిని అస్సలు నమ్మను. మేమిద్దరం చాలా బాగా చేశాము. తారక్ కూడా అద్భుతంగా నటించాడు. నా కెరీర్‌లో మరే ఇతర సినిమాలో పని చేయడాన్ని నేను ఇంతగా ఆస్వాదించలేదు. తారక్‌తో నా ప్రయాణం చాలా బాగా నచ్చింది. ఈ అవకాశం ఇచ్చినందుకు రాజమౌళి గారికి ధన్యవాదాలు' అని చరణ్‌ చాలా హుందాగా మాట్లాడాడు. అయినా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది అస్సలు సంతృప్తి కలగలేదు. ఎటువంటి పాత్రనైనా పోషించే ఎన్టీఆర్ కి ఇది అవమానమే అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ రూపంలో ఎన్టీఆర్ కెరీర్ పై రాజమౌళి దెబ్బేసినట్లు స్పష్టంగా అర్థమవుతుందని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ క్రెడిట్ నార్త్ ఇండియాలో రామ్ చరణ్, రాజమౌళి కొట్టేస్తే ఎన్టీఆర్ కి దక్కేది ఏమీ ఉండదని.. దీంతో భవిష్యత్ లో ఎన్టీఆర్ కి పాన్ ఇండియా చిత్రాలలో మార్కెట్ లభించదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఫ్యాన్స్. ఇక బాలీవుడ్ లో మార్కెట్ ఏర్పరుచుకున్న హీరోకి మాత్రమే పాన్ ఇండియా హోదా వస్తుందని అది రాజమౌళి సినిమాలతో చాలా ఈజీ అన్న ఆలోచన అందరూ స్టార్స్ లో అయితే ఉంది. రాజమౌళి బ్రాండ్ వాల్యూతో నార్త్ లో గుర్తింపు తెచ్చుకోవచ్చనేది అందరికీ తెలిసిన సత్యమే.మరి ఎన్టీఆర్ విషయంలో ఈ సూత్రం నిజమైందా లేదా అనేది త్వరలో మనకు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: