
అందాల ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఐశ్వర్య రాజేష్ 'కౌసల్య కృష్ణమూర్తి' అనే మహిళ క్రికెట్ నేపథ్యం లో తెరకెక్కిన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపక పోయినప్పటికీ ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ తన నటనతో మాత్రం ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇది ఇలా ఉంటే కౌసల్య కృష్ణమూర్తి సినిమా తర్వాత ఐశ్వర్య రాజేష్ , విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా ఈ ముద్దుగుమ్మకు బాక్సాఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది. కాకపోతే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో కూడా ఐశ్వర్య రాజేష్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 
ఇది ఇలా ఉంటే తాజాగా ఐశ్వర్య రాజేష్ , సాయి ధరమ్ తేజ హీరోగా తెరకెక్కిన రిపబ్లిక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇలా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఐశ్వర్య రాజేష్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు తన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉండే ఐశ్వర్య రాజేష్ తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఐశ్వర్య రాజేష్ వైట్ కలర్ లో ఉన్న డ్రెస్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఐశ్వర్య రాజేష్ తాజాగా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలను చూసిన కొంత మంది నెటిజన్లు బ్యూటిఫుల్ , నేచురల్ బ్యూటీ , లవ్ సింబల్ ఎమోజి లను కామెంట్లు గా పెడుతున్నారు.

