బాలీవుడ్ బిగ్ బీ కోడలు ఐశ్వర్య రరాయ్, అలాగే కుమారుడు అభిషేక్ బచ్చన్ ల గురించి ప్రత్యేకంగా మనం పరిచయం చేయవలసిన అవసరం లేదు. అంతే కాదు ఈ జంట ప్రేమించి మరి పెళ్లి చేసుకున్న విషయం కూడా అందరికి తెలిసిందే. అయితే కొంతకాలం పాటు ప్రేమించుకున్న ఈ జంట సడెన్ గా 2007 ఏప్రిల్ 20న మూడు ముళ్ళతో ఒక్కటయ్యి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంతే కాదు అప్పట్లో వీరి పెళ్లి చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇక వీళ్ల పెళ్లి జరిగి నిన్న ఏప్రిల్ 20 నాటికి 15 ఏండ్లు పూర్తి అయ్యింది. కాగా ఈ జంటకు చెందిన కొన్ని ఆసక్తికర విషయాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతే కాదు పెళ్లయిన కొత్తలో ఈ జంట "ఓఫ్రా విన్ ఫ్రే" టీవీ షోలో కూడా పాల్గొన్నారు.

మరి ఈ క్రమంలో అభిషేక్ బచ్చన్ తన అభిమానులతో కొన్ని ఆసక్తికర సంఘటలను పంచుకున్నారు. అందాల భామ ఐశ్వర్యకు తాను ఏ రకంగా ప్రపోజ్ చేశాడు,  అలాగే ఇద్దరు కలసి ప్రేమలో ఉన్నప్పుడు ఏ విధంగా రోజు సమయాన్ని గడిపారు అన్న విషయాలను  పంచుకున్నాడు. ఇక ఒక ఇంటర్వ్యూలో భాగంగా అయితే యాంకర్ ఓఫ్రా.. అయితే మీరు ప్రపంచంలోనే అందరికన్నా అందమైన ఆమెను వివాహం ఆడారు కదా మరి మీకు ఎలా అనిపిస్తుంది అని అభిషేక్ ను  అడగగా .. దీనికి సమాధానంగా  బచ్చన్ ఏ మాత్రం తడబడకుండా చాలా అనందంగా అలాగే సంతోషంగా బదులిచ్చాడు. ఇక అంతేకాకుండా ఐశ్వర్య చాలా అందంగా ఉంటుంది, అలాగే చాలా మంచిది, తాను ఉదయం నిద్ర లేచినప్పుడు ఎలాగయితే  ఉంటుందో రోజు మొత్తంగా కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది అని కూడా చెప్పాడు.

కాగా అభిషేక్  చెప్పిన సమాధానంకి బదులుగా పక్కనే కూర్చుని ఉన్న ఐశ్వర్య తన భర్త వైపు చూసి నవ్విందట. అటు తరువాత ఐశ్వర్య మాట్లాడుతూ ఆమె అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకోవటానికి గల కారణం చెప్పేసింది.. అభిషేక్ బచ్చన్ ప్రతి  విషయాన్ని కూడా చాలా ఫన్నీగా రిసీవ్ చేసుకుంటాడు అంటూ అభిషేక్ బచ్చన్ ని పొగడ్తలతో ముంచెత్తింది. అయితే  ఈ దంపతులకు ఆరాధ్య బచ్చన్ అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే. అంతే కాదు ఈ జంట కలిసి చాలా సినిమాలలో కూడా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: