కరోనా ముందు నుండి షూటింగ్ దశలో ఉండి ఈ రోజు గ్రాండ్ గా థియేటర్ లలో రిలీజ్ అయింది ఆచార్య. ఈ సినిమాను టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. గత వారం వరకు ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. కానీ గత వారం ప్రి రిలీజ్ ఈవెంట్ జరిగిన రోజు నుండి అంచనాలు పెరిగిపోయాయి. అందునా ఈ సినిమాలో కాజల్ ను అనుకోకుండా తప్పించడం వంటి విషయం బాగా వైరల్ అయింది. అందుకే చిరంజీవి మొదటి సారి హీరోయిన్ లేకుండా ఒంటరిగా బరిలోకి దిగాడు అనే విషయంపై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అలా ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఇందులో హీరోలుగా నటించిన మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ లు తమ పాత్రలకు ప్రాణం పోశారని తెలుస్తోంది. ఆచార్య, సిద్ద పాత్రలు ప్రేక్షకులను కనువిందు చేశాయట. మెగాస్టార్ వయసు పెరిగే కొద్దీ నటనలో మాత్రం తగ్గడం లేదట. ముందుగా కొరటాల ఎంచుకున్న స్టోరీ లైన్ బాగుంది. కానీ టేకింగ్ బాగా లేదని ఎక్కువగా వినబడుతోంది. కొరటాల ఇంతకు ముందు చేసిన సినిమాల్లో ఉన్న మ్యాజిక్ మిస్ అయిందని అంటున్నారు. ఇంతకు ముందు వరకు తన గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంటూ వచ్చిన కొరటాలసినిమా విషయంలో పూర్తిగా తేలిపోయారు. ఫస్ట్ ఆఫ్ ఫైట్స్ మరియు రామ్ చరణ్ సీన్ లతో ఆకట్టుకున్నా సెకండ్ హాఫ్ లో మెగా అభిమానులను మరియు మిగిలిన ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచాడు.

సినిమాకు ప్రాణంగా భావించే క్లైమాక్స్ లో ప్రాణం లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో కూడా మణిశర్మ ప్రభావం కనిపించలేదు. ఒక్క బంజారా పాట మినహా ఏవీ ఆకట్టుకోలేదు. ఇక కాజల్ లేని ఎఫెక్ట్ కూడా సినిమాలో ఉండనే ఉంది అని అంటున్నారు. వరుస విజయాల సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాలకు ఆచార్య తో బ్రేక్ పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: