మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తీసిన లేటెస్ట్ సినిమా ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలపై ఎంతో భారీ వ్యయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితం అయిన ఆచార్య మూవీలో తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి తో పాటు ఆయన కుమారుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాకి తిరు కెమెరా మ్యాన్ గా వ్యవహరించడం జరిగింది.

సినిమా ప్రారంభం నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇటీవల అందరిలో భారీ క్రేజ్ తో అత్యధిక థియేటర్స్ లో విడుదలైన ఆచార్య మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ దిశగా కొనసాగుతోంది. ముఖ్యంగా సినిమాలో దర్శకుడు కొరటాల శివ తీసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ కథనాన్ని నడిపించిన తీరు ఏ మాత్రం బాగోలేదని, ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించిన ఈ సినిమా సెకండ్ హాఫ్ మరింత దారుణంగా ఉందని మెజారిటీ ప్రేక్షకులు, అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాకి మణిశర్మ అందించిన సాంగ్స్ కూడా థియేటర్స్ లో పెద్దగా ఆకట్టుకోలేదు, అయితే ఆయన బీజీఎమ్ మాత్రం కొన్ని చోట్ల బాగానే ఉందని అంటున్నారు.

కాగా ఆచార్య పాత్రలో మెగాస్టార్, అలానే సిద్ద పాత్రలో మెగాపవర్ స్టార్ ఇద్దరూ కూడా ఎంతో బాగా నటించారని, అలానే పూజా హెగ్డే కూడా తన పాత్రలో బాగా నటించినప్పటికీ ఆ పాత్రకి అంతగా ప్రాధాన్యత లేదని, ఓవరాల్ గా ఆచార్య అంతగా ఆకట్టుకునే అవకాశం లేదని మొదటి రోజు మొదటి రోజు నుండే టాక్ వచ్చింది. ఇక అక్కడి నుండి ఇప్పటివరకు అనేక ప్రాంతాల్లో ఆచార్య దారుణమైన కలెక్షన్స్ అందుకుంటోంది. దాదాపుగా చాలా ఏరియాల్లో సాధారణం కంటే కూడా తక్కువ స్థాయి కలెక్షన్స్ రాబడుతున్న ఆచార్య, సోమవారం నుండి మరింత తక్కువ కలెక్షన్స్ రాబడుతోందని, ఇక ఈ సినిమా పరిస్థితి చాలా చోట్ల పూర్తి నిరాశాజనకంగా ఉండడంతో ఓవరాల్ గా మూవీ పెద్ద డిజాస్టర్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: