టాలీవుడ్ లో ప్రస్తుతం వరుసగా సక్సెస్ లతో కొనసాగుతున్న హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. గత ఏడాది వకీల్ సాబ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్న పవన్, ఇటీవల వచ్చిన భీమ్లా నాయక్ మూవీ ద్వారా కూడా మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. రానా దగ్గుబాటి మరొక హీరోగా నటించిన ఈ సినిమాలో సంయుక్తా మీనన్, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటించగా థమన్ సంగీతం అందించారు.

మంచి యాక్షన్ తో కూడిన ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ లో టైటిల్ రోల్ పోషించిన పవర్ స్టార్ ఆ పాత్రలో అదరగొట్టే పెర్ఫార్మన్స్ తో అందరినీ అలరించారు. ఇక ప్రస్తుతం పవన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం ర్యాంత్నం నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నర్గీస్ ఫక్రీ ఒక కీలక రోల్ చేస్తున్నట్లు టాక్. ఇటీవల కొంత భాగం షూటింగ్ జరుపుకున్న హరి హర వీరమల్లు తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుండగా ఈ షెడ్యూల్ లో కొన్ని భారీ యాక్షన్ సీన్స్ తీయనున్నారని, ఇందులో సీన్స్ కోసం పవన్ కళ్యాణ్ డేరింగ్ గా రియల్ గా స్టంట్స్ చేయనున్నారు అనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. గతంలో పలు సినిమాల్లోని యాక్షన్ సీన్స్ లో డూప్ లేకుండా పాల్గొని డేర్ చేసిన పవన్, ఈ సినిమాలోని భారీ సీన్స్ కోసం పెద్ద సాహసమే చేస్తున్నారని, రేపు రిలీజ్ తరువాత ఈ యాక్షన్ సీని ప్రేక్షకాభిమానులని ఎంతో ఆకట్టుకుంటుందని అంటున్నారు. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నట్లు టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: