మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ మరొక కీలక రోల్ లో నటించిన లేటెస్ట్ సినిమా ఆచార్య. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తీసిన ఈ భారీ ప్రాజక్ట్ లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు ఈ సినిమాని ఎంతో భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. చిరంజీవి ఆచార్య అనే పాత్ర చేసిన ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ద పాత్ర చేసారు.

మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీకి తిరు ఫోటోగ్రఫి సమకూర్చారు. మొదటి నుండి అందరిలో సూపర్ గా అంచనాలు ఏర్పరిచిన ఆచార్య సినిమా రిలీజ్ తరువాత మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా పరాజయం పాలయింది. తన కెరీర్ లో వరుసగా హిట్స్ తో దూసుకెళ్తున్న కొరటాల శివకి ఆచార్య భారీ డిజాస్టర్ ఎంతో షాక్ ఇచ్చింది. తొలిసారిగా మెగాస్టార్ తో కలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కలిసి నటించడంతో పాటు దిగ్గజ దర్శకుడైన కొరటాలసినిమా తీయడంతో అందరిలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా సాంగ్స్ బాగానే శ్రోతలను ఆకట్టుకున్నప్పటికీ ట్రైలర్ మాత్రం ఒకింత యావరేజ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక మూవీ విడుదల తరువాత ఏమాత్రం కూడా ఆకట్టుకోలేదు సరికదా అసలు ఇది దర్శకుడు కొరటాల శివ గత సినిమాల మాదిరిగానే లేదని, ఇక చిరు, చరణ్ ఇద్దరూ తమ తమ రోల్స్ లో బాగా నటించినప్పటికీ కథ, కథనాల్లో భారీ లోపాలు ఉండడం, సెకండ్ హాఫ్ అయితే మరింత సాగతీతగా ఉండడంతో ఆచార్య కు ఇంత భారీ డిజాస్టర్ టాక్ వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.

ఇక తన కెరీర్ లో 150 కి పైగా సినిమాలు చేసి టాప్ హీరోగా ఇప్పటికీ కూడా సూపర్ క్రేజ్ తో కొనసాగుతున్న చిరంజీవి గత కొన్నేళ్లలో ఇంత భారీ పరాజయాన్ని ఎప్పుడూ చవిచూడలేదని, ఈ సినిమా దాదాపుగా రూ.90 నుండి రూ.100 కోట్ల మేర డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు నష్టాలని మిగిల్చే ఛాన్స్ ఉందని, ఇప్పటికే సినిమా చాలా చోట్ల దారుణంగా కొనసాగుతున్నట్లు చెప్తున్నారు ట్రేడ్ అనలిస్టులు. అయితే ఆచార్య భారీ ప్లాప్ తరువాత ప్రస్తుతం విదేశాలకు ఫ్యామిలీ తో వెళ్లిన చిరంజీవి తదుపరి సినిమాల విషయమై గట్టిగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: