టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న మంచి టాలెంటెడ్ దర్శకుల్లో ఒకరైన గోపీచంద్ మలినేని గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గోపిచంద్ మలినేని మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన డాన్ శీను మూవీ తో దర్శకుడిగా తన కెరియర్ ను ప్రారంభించాడు. మొదటి సినిమాలోనే హీరో ను చూపించిన విధానం,  హీరో క్యారెక్టరైజేషన్ ఎలివేషన్ చేసిన విధానంతో గోపీచంద్ మలినేని ఇటు ప్రేక్షకుల నుండి, అటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్నాడు.

అలాగే డాన్ శీను సినిమా మంచి విజయం సాధించడంతో పాటు మంచి కలెక్షన్లను కూడా బాక్సాఫీస్ దగ్గర అందుకుంది. డాన్ శీను మూవీ తో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపిచంద్ మలినేని ఆ తర్వాత బాడీగార్డ్ , బలుపు , పండగ చేస్కో ,  విన్నర్ , క్రాక్ వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు.  ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమాకు చిత్ర బృందం టైటిల్ ను కన్ఫామ్ చేయలేదు. అయితే దర్శకుడు గోపీచంద్ మలినేని బాలకృష్ణ తో తెరకెక్కిస్తున్న  సినిమాకు జై బాలయ్య మరియు అన్నగారు అనే టైటిల్  లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు టైటిల్ లలో ఏదో ఒక టైటిల్ ను బాలకృష్ణ సినిమాకు కన్ఫామ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.  మరి గోపీచంద్ మలినేని ఈ రెండు టైటిల్ లో ఏదో ఒకదాన్ని కన్ఫామ్ చేస్తాడా...  లేక వేరే టైటిల్ ను కన్ఫామ్ చేస్తాడా అనేది తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: