టాలీవుడ్ కింగ్ నాగార్జున.. ఈ హీరో గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అప్పట్లో ఆయన గ్రీకువీరుడి గా అమ్మాయిల కలల రాకుమారుడిగా లవర్బాయ్ గా కొనసాగాడు అనే చెప్పాలి. ఆరు పదుల వయస్సుకు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ అదిరిపోయే ఫిట్నెస్ మెయింటెన్ చేస్తూ అమ్మాయిల కలల రాకుమారుడిగానే కొనసాగుతూ ఉండడం  గమనార్హం. ఎంతో మంది యువ హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్న నాగార్జునకు ఉన్న అమ్మాయిల ఫాలోయింగ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అని చెప్పాలి. ఇక అప్పట్లో నాగార్జున పేరు చెపితే చాలు ఎంతో మంది హీరోయిన్లు మెలికలు తిరిగి పోయేవారు.


 అలాంటి హీరోయిన్లలో ఒకరు కస్తూరి. ఒకప్పుడు నాగార్జున తో కలిసి నటించిన ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తూ   నటనతో ఆకట్టుకుంది అన్న విషయం తెలిసిందే. స్టార్ మా లో ప్రసారమయ్యే గృహలక్ష్మి సీరియల్ లో మెయిన్ రోల్ పోషిస్తోంది కస్తూరి. అయితే నాగార్జున కెరీర్లో మైలురాయి లాంటి సినిమా  అన్నమయ్య లో నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది కస్తూరి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగార్జున పై తనకు ఉన్న అభిమానం ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. నాగార్జునను చూడగానే మొదటి చూపులోనే పడిపోయాను. ఆయన అంటే నాకు పిచ్చి అంటూ తెలిపింది.

 నాగార్జున తో అన్నమయ్య ఆకాశవీధిలో లాంటి సినిమాలను చేశాను అంటూ చెప్పుకొచ్చింది. అన్నమయ్య సినిమా షూటింగ్ సమయంలో నాగార్జున నా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో  నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను.. సినిమాల్లో హీరోలు చేసినట్లుగానే ఇక ఆ రోజు మొత్తం నా చేతిని ఎవరిని ముట్టుకొనివ్వకుండా జాగ్రత్తపడ్డాను. అంతలా నాగార్జున అంటే ఇష్ట పడేదాన్ని అంటూ కస్తూరి చెప్పుకొచ్చింది. అయితే ఒక వైపు సీరియల్స్ లో గృహిణిగా నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికే తన గ్లామర్ తో కుర్రకారు మతి పోగొడుతుంది కస్తూరి.

మరింత సమాచారం తెలుసుకోండి: