మిల్క్ బ్యూటీగా సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న తమన్న.. శ్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత హ్యాపీడేస్ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి పరిచయమై 17 సంవత్సరాలు పూర్తవుతోంది. కేరియర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు చిన్న పెద్ద అనే తేడా లేకున్నా వరుస సినిమాలలో నటిస్తూ హిట్ , ఫ్లాప్ లతో సంబంధం లేకుండా అలాగే సీనియర్ జూనియర్ హీరోలతో కూడా కలిసి నటించిన ఏకైక ముద్దుగుమ్మ అని చెప్పవచ్చు.

ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 17 సంవత్సరాల అవుతున్నప్పటికీ సినిమాలకు గ్యాప్ ఇవ్వకుండా వరుసగా హీరోయిన్ పాత్రలలో నటిస్తున్న  తమన్న తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో కూడా నటించి మెప్పించింది. ఏ సినీ ఇండస్ట్రీలో ఏ ఏ సీనియర్ హీరోలతో నటించింది అన్న విషయానికి వస్తే.. ముఖ్యంగా తెలుగులో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ,బాలకృష్ణ లాంటి హీరోలతో కలిసి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. తమిళంలో ముందుగా సీనియర్ హీరోల విషయానికొస్తే రజినీకాంత్,  కమలహాసన్ తో కూడా నటించింది. అలాగే బాలీవుడ్ లో సీనియర్ హీరోలైన అజయ్ దేవగన్ , సల్మాన్ ఖాన్,  అక్షయ్ కుమార్ , అమీర్ ఖాన్ వంటి హీరోలతో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ.

మలయాళం సినీ ఇండస్ట్రీ విషయానికి వస్తే మమ్ముట్టి,  మోహన్ లాల్ , దిలీప్ వంటి హీరోలతో కలిసి నటించింది. ఇక ఈ విధంగా ఆమె ప్రతి సినిమా ఇండస్ట్రీలో కూడా తప్పకుండా సీనియర్ హీరోలతో నటించడం గమనార్హం. త్వరలోనే మిగతా వారితో జతకట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈమె వయసు 32 సంవత్సరాలు మాత్రమే .. కానీ తనకంటే సీనియర్ హీరోలతో కలిసి నటించడం తన నటనకు నిదర్శనం అని చెప్పాలి. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తమన్నా ఇండస్ట్రీకి వచ్చి ఆమె వయసు 16 ఏళ్ళు. అందుకే ఎక్కువగా సీనియర్ హీరోల సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: